ఇటీవల మహేశ్ బాబు తన టూర్స్ ను కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీతో హైదరాబాద్ కు తిరిగి వచ్చినా విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇటు టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్, పవర్ స్టార్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.