
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో పూనకాలే. అప్ డేట్లకి ఊగిపోతుంటారు. ఆయన డైలాగ్‌లకు రెచ్చిపోతుంటారు. డాన్సు స్టెప్పులకు పూనకాలు లోడింగ్ అంటారు. ఇలా పవన్ సినిమా నుంచి ఏ అప్ డేట్ వచ్చినా, ఏ మూమెంట్ వచ్చినా ఫ్యాన్స్ కి పండగే. జస్ట్ పవన్ తెరపై కనిపిస్తేనే ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే ఇటీవల ఆయన రాజకీయాల్లో, డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలు రాలేదు. ఆయన మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆయన స్టెప్పులు చూసి మూడేళ్లు అవుతుంది.
ఇన్నాళ్లకి ఇప్పుడు అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ లో జోష్ నింపారు పవన్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న `హరిహర వీరమల్లు` మూవీ నుంచి రెండో పాట వచ్చింది. `కొల్లగొట్టినాదిరో` అంటూ సాగే ఈ పాటని సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు.
ఈ సినిమాలో పవన్ వీరమల్లుగా కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఆ గెటప్‌లో ఆయన ఈ పాటకి డాన్సులు చేశారు. హీరోయిన్‌తో కలిసి డాన్సు స్టెప్పులు వేయడం విశేషం. ఈ లిరిక్ సాంగ్‌లో మధ్య మధ్యలో డాన్స్ మూమెంట్లని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది టీమ్. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది.
read more: చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్ చరణ్
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ పాటని స్వరపర్చగా, చంద్రబోస్ ఈ పాటని రాశారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ ఆలపించి పాటకు మరింత మాధుర్యం తీసుకొచ్చారు.
కీరవాణి అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.
ఈ గీతం సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళింది. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు.. ఎంతో వినసొంపుగా, శ్రోతలను కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
తెరపై ఈ జోడి చూడముచ్చటగా ఉంది. అలాగే ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరు సేమ్ డ్రెస్‌లో కలిసి స్టెప్పులేయడం హైలైట్‌గా నిలిచింది. పాటకి అందాన్ని తీసుకొచ్చింది.
సాంగ్ భారీ సెట్, విజువల్స్ ఇందులో మరో ఆకర్షణగా నిలిచాయి. పాట విజువల్ వండర్‌లా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మొదటి పాట `మాట వినాలి` విశేష ఆదరణ పొందగా, ఇప్పుడు విడుదలైన రెండో పాట సైతం శ్రోతలను అలరిస్తుంది. ఫ్యాన్స్ చేత డాన్సులు వేయిస్తుందని చెప్పొచ్చు.
`హరి హర వీరమల్లు` చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. అయితే రిలీజ్ పై కొంత సస్పెన్స్ ఉంది. టీమ్ మాత్రం ఆ డేట్‌కి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగా ప్రమోషనల్ కంటెంట్‌ని వదులుతున్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.
also read: మూడు గంటలు క్యాన్సర్ ఆపరేషన్, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్ మాటలకు కన్నీళ్లు