శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా కుబేరా. ఈ మూవీ జూన్ 20న తెలుగు , తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా ధనుష్‌తో పాటు నాగార్జున, రష్మిక మందన్న, సునైనా, భాగ్యరాజ్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో సునిల్ నారంగ్, శేఖర్ కమ్ముల కలిసి ఈసినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నటుడు ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.