హరిహర వీరమల్లు సెన్సార్ కంప్లీట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ఆ రోజు విశాఖలో జనసంద్రమే..

Published : Jul 14, 2025, 06:07 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై ఊహకందని విధంగా అంచనాలు నెలకొన్నాయి.

PREV
15
హరిహర వీరమల్లు సెన్సార్ పూర్తి 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై ఊహకందని విధంగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ ను పొందింది.

25
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో.. 

17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.

ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్ ను ఎంతగానో ప్రశంసించారు. ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

35
సెన్సార్ బోర్డు సభ్యుల ప్రశంసలు

'హరి హర వీరమల్లు' చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలు. ఈ రెండున్నర గంటల వెండితెర అద్భుతం.. సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనాన్ని, భారీ విజువల్స్ ను వారు ప్రశంసలతో ముంచెత్తారు.

45
వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక

'హరి హర వీరమల్లు'పై అంచనాలను మరింత పెంచుతూ.. జూలై 20వ తేదీన వైజాగ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు.

55
నటీనటులు

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదలవుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా అసలుసిసలైన పాన్-ఇండియన్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. USAలో ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ సేల్స్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యాక్షన్, డ్రామా, భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ చారిత్రాత్మక గాథను వెండితెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ దయాకర్ రావు నిర్మించారు. 

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి.

Read more Photos on
click me!

Recommended Stories