కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఎవరికి వారే దిట్ట.. చిరంజీవి, బాలయ్య కాదు

Published : Jul 14, 2025, 04:51 PM IST

విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా రాణించిన కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?. ఆయన ఇద్దరు పేర్లు చెప్పారు. కాకపోతే వారు చిరంజీవి, బాలయ్య కాదు. 

PREV
15
కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన హీరో ఎవరంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న కోట శ్రీనివాసరావు చిత్ర పరిశ్రమని వదిలేసి వెళ్లిపోయారు. 

నాలుగున్నర దశాబ్దాలపాటు ఆడియెన్స్ ని అలరించిన ఆయన ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. 

కోట శ్రీనివాసరావు తన మనసులో ఏమున్నా నిర్మొహమాటంగా చెబుతారు. ఏమాత్రం దాచుకోకుండా మాట్లాడతారు. 

ఆ మాటలే కొన్నిసార్లు వివాదంగానూ మారాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ జనరేషన్‌లో తనకు ఇష్టమైన నటులు ఎవరో వెల్లడించారు.

25
నాలుగు తరాల హీరోలతో పనిచేసిన కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల నుంచి సూపర్‌ స్టార్‌ కృష్ణ, శోభన్‌ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌, నాగార్జున వంటి రెండు తరాల నటులతోపాటు ప్రభాస్‌, పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ వంటి మూడో తరం హీరోలు, 

ఆ తర్వాత తరం నటులతోనూ కలిసి నటించారు. బాడీ సహకరించినంత కాలం నటిస్తూనే ఉన్నారు కోట. చివరగా ఆయన `హరిహర వీరమల్లు`లో నటించినట్టు సమాచారం.

35
కోట మెచ్చిన హీరోలు ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌

ఇదిలా ఉంటే ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు ఈ జనరేషన్‌లో తనకు ఇష్టమైన హీరో ఎవరో తెలిపారు. ఇప్పటి తరం హీరోల్లో జూ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ అంటే ఇష్టమట.

 వీరిద్దరిలో జూ ఎన్టీఆర్‌ డైలాగ్‌ డెలివరీ బాగుంటుందని, చాలా గమ్మత్తు ఉంటుందన్నారు. అలాగే అల్లు అర్జున్‌లోనూ డైలాగ్‌ డెలివరీ బాగానే ఉందిగానీ, తారక్ లా ఉండదన్నారు. 

కానీ `బన్నీ యాక్షన్‌ గానీ, డాన్సులుగానీ చూస్తుంటే ఎలా చేస్తున్నాడురా అనిపిస్తుంటుంది. అంతా బాగా చేస్తాడు. ఆయన స్పెషాలిటీ ఆయనదే` అని అన్నారు.

45
బన్నీ కమిట్‌మెంటే ఆయన సక్సెస్‌ కి కారణం

ఈ ఇద్దరు కాకుండా మహేష్‌ బాబు అంటే చాలా ఇష్టమన్నారు కోట. లవబుల్‌ బాయ్‌ అంటూ ప్రశంసించారు. 

అయితే బన్నీ గురించి మరో సందర్భంలో కోట మాట్లాడుతూ, ఆయన సక్సెస్‌ అంత ఈజీగా వచ్చింది కాదని, అతని కమిట్‌మెంటే అతని సక్సెస్‌ అని, అంత కమిటెడ్‌గా చేయడమే ఆయన విజయాన్ని ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. 

ప్రస్తుతం కోట మాటలు వైరల్‌ అవుతున్నారు. అటు తారక్‌ అభిమానులు. ఇటు బన్నీ అభిమానులు ఈ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. వీరింద్దరితోనూ సినిమాలు చేశారు కోట.

55
గ్లోబల్‌ మార్కెట్‌పై కన్నేసిన బన్నీ, తారక్‌, మహేష్‌

అల్లు అర్జున్‌, తారక్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. `పుష్ప 2`తో బన్నీ ఏకంగా ఇండియన్‌ సినిమాని షేక్‌ చేశారు. `బాహుబలి 2` రికార్డులను టచ్‌ చేశారు. 

ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో గ్లోబల్‌ రేంజ్‌ ఉన్న ఫిల్మ్ చేస్తున్నారు బన్నీ. మరోవైపు ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`, `దేవర` చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్ గా ఎదిగారు. 

ఇప్పుడు `వార్‌ 2`, ప్రశాంత్‌ నీల్‌ మూవీస్‌తో ఇండియన్‌ మూవీని షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

అదే సమయంలో మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఆయన కూడా డైరెక్ట్ గా ఇంటర్నేషనల్‌ మార్కెట్‌పై కన్నేయడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories