లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు... మహేష్ బాబుకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఆయన భారీగా రెమ్యూనరేషన్ రాబడుతున్నారు. మహేష్ బాబుకు లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు... 
 

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం నేడు. 1975 ఆగష్టు 9న జన్మించిన మహేష్ బాబు 49వ ఏట అడుగుపెడుతున్నారు. కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు హిట్ చిత్రాల్లో నటించాడు. మహేష్ బాబు తన తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ బాబు లతో మల్టీస్టారర్స్ చేయడం విశేషం. బాల్యంలోనే డ్యూయల్ రోల్ చేయడం మరొక ప్రత్యేకత. 

దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడు చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 1999లో విడుదలైన రాజకుమారుడు సూపర్ హిట్ అందుకుంది. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్స్ మహేష్ బాబును అగ్ర హీరోగా నిలబెట్టాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్ సినిమాలు బాక్సాఫీస్ కొల్లగొడతాయి. 


మహేష్ బాబు సినిమాకు రూ. 50 కోట్లకు పైగా ఆర్జిస్తున్నారు. ఆయన గత చిత్రం గుంటూరు కారం సినిమాకు రూ. 78 కోట్లు తీసుకున్నారని సమాచారం. కాగా నెక్స్ట్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళితో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు రెమ్యూనరేషన్ రూ. 125 కోట్లు అని వినికిడి. SSMB29 మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. 

సౌత్ ఇండియా రిచ్చెస్ట్ హీరోల్లో మహేష్ బాబు ఒకరిగా ఉన్నారు. సినిమాలతో పాటు వ్యాపారాలు, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. మహేష్ బాబుకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీ స్క్రీన్ బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఓ గార్మెంట్ బ్రాండ్ కూడా కలిగి ఉన్నారు. తండ్రి కృష్ణ ఆస్తుల్లో కొంత భాగం సంక్రమించింది. 

మహేష్ బాబుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా ఉంది. దాని ధర రూ. 30 కోట్ల వరకు ఉంటుంది. మహేష్ వద్ద లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. ఒక అంచనా ప్రకారం మహేష్ బాబు ఆస్తుల విలువ రూ.  250-330 కోట్లు. 2005లో మహేష్ బాబు హీరోయిన్ నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార సంతానం. మహేష్ బాబు ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద చిన్నారులకు వైద్య సహాయం అందిస్తున్నారు. 

Latest Videos

click me!