అప్పటి రూమర్లపై ఇప్పుడు స్పందించిన హన్సికా.. ఆకట్టుకుంటున్న లేటెస్ట్ లుక్

First Published | Oct 1, 2023, 8:36 PM IST

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీపై గతంలో వచ్చిన రూమర్లకు తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. మరోవైపు హన్సికా లెటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సికా మోత్వానీ (Hansika Motwani) కెరీర్ ను ప్రారంభించింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ చిత్రంతో బాలనటిగా మెప్పించింది. ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది.
 

కేవలం నాలుగేళ్లలోనే హన్సికా హీరోయిన్ గా అలరించడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ ‘దేశముదురు’ సినిమా చేసింది. పూరీ డైరెక్షన్, అల్లు అర్జున్ హీరోయిన్ గా నటించిన ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లో హన్సికా తన నటన, గ్లామర్ తో ఆకట్టుకుంది.


అయితే అప్పట్లో హన్సికా త్వరగా పెద్దగా అయ్యేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్లు తీసుకుందని కొందరు కామెంట్లు చేశారు. ఈ రూమర్లు అప్పుడు బాగా ప్రచారం అయ్యాయి. మళ్లీ గతేడాది తన పెళ్లి సమయంలోనూ రూమర్లు వ్యాపించాయి. వీటిపై హన్సికా తల్లి అప్పుడు స్పందించారు. అన్నీ కొట్టి పారేశారు. 
 

ఇక అప్పటి రూమర్లపై తాజాగా హన్సికా స్పందించినట్టు తెలుస్తోంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇలాంటి రూమర్లను పట్టించుకోను. మా అమ్మ మాత్రం చాలా బాధపడుతుంటుంది. కానీ నాకు ఆ బాధను కనిపించనివ్వదు. ఎప్పుడూ నన్ను రక్షించేది ఆమెనే. అయితే నేను పొగడ్తలను తీసుకున్నట్టే.. నెగెటివ్ కామెంట్లనూ తీసుకుంటాను.
 

రూమర్ల విషయంలో చాలా స్ట్రాంగ్ గా మారిపోయాను. కానీ మా అమ్మ బాగా బాధపడుతుంటుంది’ అంటూ అలాంటి వాటిల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం హన్సికా మాటలు వైరల్ గా మారాయి. మరోవైపు స్టార్ హీరోయిన్ లెటెస్ట్ లుక్ కూడా వైరల్ గా మారింది.
 

అటు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటకీ.. ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో హన్సికా నెట్టింట సందడి చేస్తూనే వస్తోంది. తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. వైట్ టాప్, బ్లాక్ జీన్స్ లో అదరగొట్టింది. స్టన్నింగ్ స్టిల్స్ తో, బ్యూటీఫుల్ స్మైల్ తో ఫ్యాన్స్ నే కాదు.. నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం హన్సికా తెలుగులో మూడు సినిమాలు, తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!