కాటుక కళ్లతో కలవరపెడుతున్న యాపిల్ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో కిర్రాక్ స్టిల్స్..

First Published | Oct 27, 2023, 11:46 AM IST

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయినా టూర్లు, వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ఎప్పటికప్పడు అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది.
 

సీనియర్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయస్సులోనే హీరోయిన్ వెండితెరపై అలరించిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. 
 

బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన హన్సికా.. ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించింది. తొలిచిత్రంతోనే నటిగా ఆకట్టుకుంది. గ్లామర్ పరంగానూ అట్రాక్ట్ చేసింది. 17 ఏళ్లుగా వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది.
 


టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, గోపీచంద్, రామ్ పోతినేని సరసన నటించి ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కిన హన్సికా.. ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది.
 

ఐదారు ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఉన్నా.. సమయం ఉన్నప్పుడల్లా హన్సికా టూర్లు, వెకేషన్లకూ వెళ్తూ రిలాక్స్  అవుతోంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ దుబాయ్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

దుబాయ్ బుర్జ్ ఖలీఫా దగ్గరి ఓ హోటల్ లో దిగిన హన్సికా.. అక్కడి నగర అందాలను చూపించేలా ఫొటోషూట్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ ఇస్తూనే.. సిటీ వ్యూను చూపించింది. అలాగే మత్తు ఫోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. కాటుక కళ్లు, బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది.

ట్రెండీ వేర్స్ లో మెరిసిన యాపిల్ బ్యూటీ నడుము అందాలతోనూ మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక హన్సికా.. తెలుగులో 105 మినిట్స్,, మై నేమ్ ఈజ్ శృతి, తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్, గాంధరి, మ్యాన్ సినిమాల్లో నటిస్తోంది.
 

Latest Videos

click me!