Pragya Jaiswal
మిర్చిలాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది.
Pragya Jaiswal
కంచె అనంతరం గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
Pragya Jaiswal
చాలా గ్యాప్ తర్వాత అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pragya Jaiswal
చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి.
Pragya Jaiswal
బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యకు కాలం కలిసి రాలేదు.
Pragya Jaiswal
కెరీర్ సంగతి ఎలా ఉన్నా తన ఫ్యాన్స్ ని తన గ్లామర్ తో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా ఉల్లిపొర లాంటి స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. ప్రగ్య గ్లామర్ ట్రీట్ టెంపరేచర్ పెంచేసింది.