పెళ్ళి తర్వాత భర్త, పిల్లలతో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివసిస్తోన్న ప్రీతి ఇప్పుడు మళ్లీ ముంబైలో ఆస్తులు కొనుగోలు చేయడంతో.. ఆమె ఇక్కడికి రావడం ఖాయం అంటున్నారు. ఇండియాలోనే స్థిరపడాలని.. ఆమె ఆస్తులు కొన్నట్టు చెపుతున్నారు. ఇక ప్రీతీ కొనుగోలు చేసిన ప్లాప్స్ లో.. బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఇల్లు కలిగి ఉన్నారు. అజయ్ దేవగన్, కాజోల్, ఇతర బాలీవుడ్ సెలబ్రెటీలు ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.