సీఎం విజయ్, త్రిష మధ్య ఏం జరుగుతుందా అని అభిమానులు, ఆడియన్స్అంతా ఎదురు చూస్తున్నవేళ..ఇద్దరు కలిసి ఒకే కారులో రావడం అందరిని ఆశ్చర్చపరుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే?
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ దళపతి, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష మధ్య రిలేషన్ షిప్ పై చాలా కాలంగా రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎప్పటి నుంచో వీరి మధ్య బంధంపై సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఈ విషయం ఎక్షన్ టైమ్ లో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విజయ్‌కు మరో మహిళతో సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకుల కేసు దాఖలు చేయడం.. త్రిష వల్లే విజయ్ కి సంగీత విడాకులిచ్చిందంటూ నెట్టింట కథనాలు హల్ చల్ చేశాయి.
25
చెట్టాపట్టాలేసుకుని తిరిగిన స్టార్ జంట..
ఈ వార్తలు వైరల్ అవుతున్న టైమ్ లో .. ఇద్దరు స్టార్స్ పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్న టైమ్ లో విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లికి హాజరుకావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. త్రిష విషయాన్ని ఆయుధంగా చేసుకుని.. విజయ్ ను ఎలక్షన్ లో గెలవకుండా చేయాలని ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
35
విజయ్ దళపతి ఘన విజయం
రీసెంట్ గా ఎన్నికల్లలో విజయ్ ఘన విజయం సాధించడం.. త్రిష బర్త్ డే రోజునే రిజల్ట్ రావడం, త్రిష కూడా సీఎం గా విజయ్ ప్రమాణస్వీకారానికి వచ్చి సందడి చేయడం. ఆ తర్వాత కూడా త్రిష ఆయన ఇంటికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. త్రిష విజయ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా కనిపించడం వంటి పరిణామాలు వీరి గురించి వస్తున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం అయిన తరువాత విజయ్ తొలిసారి త్రిషతో కలిసి ఒకే కారులో బయట కనిపించారు. తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి మే 30న మరణించారు. ఈ విషాద సమయంలో అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయ్, త్రిష కలిసి ఒకే కారులో అజిత్ నివాసానికి వెళ్లారు. అజిత్ స్వయంగా విజయ్, త్రిషకు ఎదురెళ్లి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం వీరిద్దరూ అజిత్ తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
55
త్రిష పోటీ చేస్తుందా?
ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్, త్రిషతో కలిసి ఒకే కారులో రావడం ప్రస్తుతం సోషల్ మీడియాా తో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే విజయ్, త్రిష తమ వ్యక్తిగత సంబంధాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.అయినప్పటికీ అజిత్ ఇంటికి ఇద్దరూ కలిసి రావడం, గతంలోనూ పలుమార్లు కలిసి కనిపించడం రకరకాల ఊహాగాణలు పుట్టుకొచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటికే త్రిష విజయ్ రాజీనామా చేసిన స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని, తమిళనాడు డిప్యూటీ సీఎం కాబోతుందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ముందు మందు ఏం జరుగుతుందో చూడాలి.