అనిరుధ్‌ను వెనక్కి నెట్టి, షాక్ ఇచ్చిన జీవీ ప్రకాష్, ఏఆర్ రెహమాన్ అల్లుడు మామూలోడు కాదు

Published : Feb 26, 2025, 07:24 PM IST

తెలుగు,తమిళ భాషల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనిరుధ్. దేవిశ్రీ, తమన్ వంటివారికి కూడా పోటీ ఇచ్చిన అనిరుధ్ కు షాక్ ఇచ్చాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్. అనిరుధ్ ను వెనక్కు నెట్టేశాడు. 

PREV
14
అనిరుధ్‌ను వెనక్కి నెట్టి,  షాక్ ఇచ్చిన జీవీ ప్రకాష్, ఏఆర్ రెహమాన్ అల్లుడు మామూలోడు కాదు
జీవీ ప్రకాష్, అనిరుధ్

సినిమాకు సంగీతం చాలా ముఖ్యం. తెలుగు,తమిళ భాషల్లో అప్పట్లో  ఇళయరాజా, ఇప్పుడు అనిరుధ్ రెండు భాషల్లో స్టార్ హీరోలకు అద్భుతమైన సంగీతం అందించి సినిమాల విజయంలో పాలు పంచుకున్నారు. . ప్రత్యేకంగా 90ల వరకు ఇళయరాజాని మించిన వారు లేరు. ఆ తర్వాత ఏ.ఆర్.రెహమాన్ వచ్చారు. ఆయన కూడా దాదాపు 20 సంవత్సరాలు ఆధిపత్యం చెలాయించారు.

ఆ తర్వాత, మధ్యలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఊపు ఊపేశారు. ఆతరువాత ఆ స్థానాన్ని అనిరుధ్ ఆక్రమిస్తూ వచ్చాడు. గత 10 సంవత్సరాలుగా తెలుగు, తమిళ సినిమాల్లో అనిరుధ్ అద్భుతమైన అభివృద్ధిని సాధించారు. ప్రస్తుతం అనిరుధ్‌ కు షాక్ ఇస్తూ.. ముందుకు వచ్చాడు  జీవీ ప్రకాష్.

Also Read: 150 దేశాలు బ్యాన్ చేసిన సినిమా, డైరెక్టర్ ను హత్య చేసేంత వివాదం అయిన మూవీ ఏదో తెలుసా?

24
తమిళ సంగీత దర్శకులు

జీవీ ప్రకాష్‌కు సినిమా అవకాశాలు రావడానికి అనిరుధ్ పతనం కూడా ఒక కారణం. అనిరుధ్ ఏ పాట చేసినా హిట్ అవుతుంది అనే పరిస్థితి ఉండగా, గత కొన్ని నెలలుగా అనిరుధ్ సంగీతం వినేవారికి విసుగు మొదలైంది. ఆయన సంగీతంలో చివరిగా వచ్చిన ఇండియన్ 2, దేవర, వేటయ్యన్, ఇంకా విడాముయర్చి ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. దీనివల్ల ఆయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Also Read:ప్రభాస్ పేరుతో ఊరు, ఎక్కడుందో తెలిస్తే షాక్ అవుతారు

 

34
జీవీ ప్రకాష్ జీతం

అనిరుధ్‌కు క్రేజ్ తగ్గుతున్న సమయంలోనే జీవీ ప్రకాష్ కుమార్ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవల జీవీ ప్రకాష్ సంగీతంలో వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు వసూళ్ల పరంగా గొప్ప విజయం సాధించాయి. ఆ సినిమాల విజయానికి ఆయన సంగీతం కూడా ముఖ్య పాత్ర పోషించింది. అంతేకాకుండా అనిరుధ్ కంటే రెమ్యునరేషన్ కూడా జీవీ ప్రకాష్ తక్కువ తీసుకుంటుండటంతో ప్రకాశ్ కు అవకాశాలు పెరుగుతున్నాయి. 

Also Read:నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?

44
జీవీ ప్రకాష్ కుమార్ మూవీ లైన్ అప్

అనిరుధ్ ఒక సినిమాకు రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ జీవీ ప్రకాష్ జీతం 10 కోట్ల కంటే తక్కువే. అందుకే నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ చేతిలో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడై, కవిన్ మాస్క్, శివకార్తికేయన్ పరాశక్తి, జీవీ ప్రకాషే హీరోగా నటిస్తున్న కింగ్‌స్టన్, తెలుగులో వెంకీ అట్లూరి - సూర్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా, వెట్రిమారన్ వాడివాసల్ ఇలా ఆయన లైన్ అప్ పెరుగుతూనే ఉంది. సో అనిరుధ్ కాస్త జాగ్రత్తపడకపోతే.. త్వరగా  పేకప్ అయ్యే అవాకాశం కనిపిస్తోంది. 

Also Read:నాగ చైతన్య లో ఈ టాలెంట్ కూడా ఉందా? శోభితా వల్ల బయటపడ్డ కొత్త నిజం

 

Read more Photos on
click me!

Recommended Stories