ఈ సినిమాలో కిడ్నాప్ చేయబడిన కొంతమంది పిల్లలను నాజీల కీలుబొమ్మలుగా మార్చినట్లు చిత్రీకరించారు. ఈ సినిమాలో లైంగిక వేధింపులు, హత్యలతో పాటు కిడ్నాప్ చేయబడిన పిల్లలను క్రూరంగా హింసించడం వంటి హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి. 18 మంది యువకులను కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. అది చూడటానికి ఇబ్బందికరంగా ఉండటం.. పిల్లలు చూసే విధంగా లేకపోవడంతో చాలా దేశాలు ఈసినిమాను నిషేదించాయి. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా అందుబాటులో ఉంది.