కల్కి, సలార్‌ 2, స్పిరిట్‌, రాజా డీలక్స్.. ప్రభాస్‌ షాకింగ్‌ లైనప్‌.. ఆరు సినిమాలు, ఆరువేలకోట్లు.. ?

Published : Jan 10, 2024, 07:08 PM ISTUpdated : Jan 12, 2024, 11:16 PM IST

ప్రభాస్‌ తన రేంజ్‌ ఏంటో `సలార్‌`తో చూపించారు. దీంతో ఆయన నెక్ట్స్ సినిమాలపై చర్చ ప్రారంభమైంది. డార్లింగ్‌ కొత్త సినిమాలు, వాటిపై జరిగే బిజినెస్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
19
కల్కి, సలార్‌ 2, స్పిరిట్‌, రాజా డీలక్స్.. ప్రభాస్‌ షాకింగ్‌ లైనప్‌.. ఆరు సినిమాలు, ఆరువేలకోట్లు.. ?

ప్రభాస్‌ చాలా రోజుల తర్వాత తనేంటో చూపించాడు. `సలార్‌` సినిమాతో డార్లింగ్‌ సత్తా చాటాడు. తన కటౌట్‌కి తగ్గ స్టోరీ, యాక్షన్‌ పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో చూపించాడు. క్రిస్మస్‌ కానుకగా విడుదలైన `సలార్‌` ఇప్పటి వరకు 700కోట్లు వసూలు చేసింది. ఈ సంక్రాంతి వరకు దీని రన్‌ ఉండబోతుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలో నటించారు. 
 

29

ఇక `సలార్‌` హంగామా అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్‌ నెక్ట్స్ సినిమాలపై అంతా ఫోకస్‌ చేస్తున్నారు. ఒక్కసారి డార్లింగ్‌ లైనప్‌ చూస్తే ఇప్పుడు మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. ఆయన చేతిలో ఇప్పుడు ఏకంగా ఆరు ప్రాజెక్ట్ లున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. అన్ని సినిమాల టార్గెట్‌ మినిమమ్‌ వెయ్యి కోట్లు. వచ్చే రెండు మూడేళ్లలో ప్రభాస్‌ పేరుతో జరిగే బిజినెస్‌ వేల కోట్లలో ఉండబోతుండటం విశేషం. మరి ఆ మూవీస్‌ ఏంటి? వాటి బడ్జెట్‌, వాటిపై జరిగే బిజినెస్‌ ఎంతనేది చూస్తే.. 
 

39

ప్రభాస్‌ నుంచి వెంటనే రిలీజ్‌ కాబోతున్న మూవీ `కల్కి2898ఏడీ`. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ ఇది. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. బిగ్‌ బీ అమిత్‌ బచ్చన్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న మూవీ ఇది. చిత్రీకరణ దశలో ఉన్న సినిమా ఇది. మైథలాజికల్‌ సైన్స్ ఫిక్షన్‌గా ఈ మూవీ రూపొందుతుంది. దీన్ని గ్లోబల్‌ ఫిల్మ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు నాగ్‌ అశ్విన్‌. 
 

49
kalki

`కల్కి` సినిమా పేరుతోనే రెండువేల కోట్ల బిజినెస్‌ని ఆశిస్తున్నారు మేకర్స్. దాదాపు వెయ్యి కోట్ల థియేట్రికల్‌ బిజినెస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టార్గెట్‌ `బాహుబలి 2` కలెక్షన్లని బ్రేక్‌ చేయడం. అంటే దాదాపు రెండువేల కోట్లకుపైగా కలెక్షన్లని టీమ్‌ ఆశిస్తుంది. పైగా ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. రెండింటి పేరుతో దాదాపు మూడు వేల కోట్లు దందా నడుస్తుందని చెప్పొచ్చు. 

59

ఇక దీంతోపాటు చిన్న సినిమా చేశాడు ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు.  రెగ్యూలర్‌ తెలుగు కమర్షియల్‌ మూవీగా మారుతి ప్రాజెక్ట్ ఉండబోతుందట. కామెడీ, ఫైట్స్, ఫ్యామిలీ ఎలిమెంట్లు, లవ్‌, రొమాన్స్ తోపాటు హర్రర్‌ ఎలిమెంట్లుఇలా అన్నీ మేళవింపుగా, విందు భోజనంలా ఉండబోతుందని తెలుస్తుంది. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఐదు వందల కోట్ల కలెక్షన్లని ఎక్స్ పెక్ట్ చేస్తుంది టీమ్‌. మరి ఆ రేంజ్‌లో కంటెంట్‌ ఉంటుందా? అనేది చూడాలి. 

69
Spirit

దీంతోపాటు `యానిమల్‌` ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీ చేస్తున్నారు ప్రభాస్‌. ఇది సమ్మర్‌ వరకు ప్రారంభం కానుంది. ఇందులో పోలీస్‌ పాత్రలో ప్రభాస్‌ కనిపించబోతున్నారట. మొదటి సారి ఆయన పోలీస్‌గా రచ్చ చేయబోతున్నారు. అయితే క్యారెక్టరైజేషన్‌ ప్రధానంగా సినిమా సాగనుంది. సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరో ఏ రేంజ్‌ యాటిట్యూడ్‌తో ఉంటాడో తెలసిందే. అదే ప్రభాస్‌ చేస్తే దాని లెక్క వేరే. ఆ లెక్క వేరేలా భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించేందుకు సందీప్‌ రెడ్డి వంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి వెయ్యి కోట్ల బిజినెస్‌ జరుగుతుందని భావిస్తున్నారు. `కల్కి` సినిమా హిట్‌ ని బట్టి దీని రేంజ్‌ కూడా పెరిగే అవకాశం ఉంది. అలా వెయ్యి నుంచి 1500కోట్ల వ్యాపారం ఈ మూవీ పేరుతో జరగబోతుందని చెప్పొచ్చు. 
 

79

దీంతోపాటు `సలార్‌ 2` రానుంది. `సలార్‌` పెద్ద హిట్ కావడం, మొదటి భాగంలో చాలా అంశాలను సస్పెన్స్ తో వదిలేయడంతో రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది. `సలార్‌ః శౌర్యాంగ పర్వం` పేరుతో రెండో పార్ట్ తెరకెక్కబోతుంది ప్రశాంత్‌ నీల్‌. సేమ్‌ కాస్టింగ్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని పేరుతో సుమారు 1200కోట్ల కలెక్షన్లని అంచనా వేస్తున్నారు. సినిమా అదే రేంజ్‌లో సాలిడ్‌గా ఉంటే, ప్రభాస్‌ రేంజ్‌కి ఇది ఈజీగా 1500కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. 

89

దీంతోపాటు `సీతారామం` ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్‌ అయ్యారు ప్రభాస్‌. ఈ మూవీ ఆల్మోస్ట్ ఓకే అయ్యింది. ఇది ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వార్‌ నేపథ్యంలో సాగే మూవీ ఇదని, ఇందులో సైనికుడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ మూవీని కూడా భారీ స్థాయిలో రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ పై వెయ్యి కోట్ల బిజినెస్‌ని ఆశిస్తున్నారు. 
 

99

మరోవైపు మంచు విష్ణ, మోహన్‌బాబు నటిస్తున్న `కన్నప్ప` చిత్రంలో ప్రభాస్‌ గెస్ట్ రోల్‌ చేయబోతున్నారు. ఎక్సె టెండెడ్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నట్టు సమాచారం. మైథలాజికల్‌ డ్రామాగా ఇది రూపొందుతుంది. మోహన్‌లాల్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి ప్రభాస్‌కి సంబంధం లేకపోయినా, అంతిమంగా ఆయన పేరుని చూపించే బిజినెస్‌ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎంత లేదన్నా, రెండు మూడు వందల కోట్ల బిజినెస్‌ ఈ మూవీ పేరుతో సాగుతుందని చెప్పొచ్చు. ఇలా ప్రభాస్‌ నటించే ఆరు సినిమాలతో, ఆరు వేల కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క హీరోపై ఈ రేంజ్‌లో వ్యాపారం జరగడం మామూలు విషయం కాదు. ఇండియాలోనే ఈ ఘనత సాధించిన హీరోగా ప్రభాస్‌ నిలుస్తారని చెప్పొచ్చు. ఇక ప్రభాస్‌ హవా `సలార్‌`తో స్టార్ట్ అయ్యింది. దీని ముగింపు మాత్రం ఊహించలేనిది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories