ఈ సోగ్గాడు, శోభన్ బాబు వారసుడా...? ఎవరీ అందగాడు? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published : Jan 10, 2024, 05:31 PM IST

అందానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అతికొద్ది మంది హీరోల్లో శోభన్ బాబు ఒకరు. ఈ మొదటి తరం హ్యాండ్సమ్ హీరోకి విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా మోడ్రన్ శోభన్ బాబు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటి సంగతేంటో చూద్దాం..   

PREV
16
ఈ సోగ్గాడు, శోభన్ బాబు వారసుడా...? ఎవరీ అందగాడు? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Sobhan Babu


ఎన్టీఆర్, ఏఎన్నార్ సిల్వర్ స్క్రీన్ ని ఏలుతున్న రోజుల్లో శోభన్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆరడుగుల ఆహార్యం, చక్కని రూపంతో శోభన్ బాబు వంద శాతం హీరో మెటీరియల్. 1959లో విడుదలైన దైవ బలం మూవీతో హీరో అయ్యాడు. 

 

26
Sobhan Babu

తనకంటూ ఒక జోనర్, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. అందుకే శోభన్ బాబు ఎక్కువగా ఆ తరహా పాత్రలు చేశారు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడుగా అనేక సినిమాలు చేశాడు. 
 

36
Sobhan Babu

శోభన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు. డబ్బులు కూడబెట్టడం, సంపదను సరైన చోట పెట్టుబడిగా పెట్టడం తెలిసిన ఆర్థిక నిపుణుడు. చిత్ర పరిశ్రమలో ఒడిదుడుకులు, రాజకీయాలు, ఇబ్బందులు చూసినవాడు. అందుకేనేమో శోభన్ బాబు తన కుటుంబాన్ని చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచాడు. 

 

46
Sobhan Babu

కాగా శోభన్ బాబు యంగ్ లుక్ వైరల్ అవుతుంది. సిక్స్ ప్యాక్ బాడీతో కత్తిలా ఉన్న ఈ తరం శోభన్ బాబుని చూస్తే అమ్మాయిలు కళ్ళు తిప్పుకోలేరు. ఎవరీ అందగాడు? శోభన్ బాబు వారసుడా అంటే... పప్పులో కాలేసినట్లే. 
 

56
Sobhan Babu


ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మాయ. ఈ సాంకేతికత ఉపయోగించి శోభన్ బాబును రీ క్రియేట్ చేశారు. ఈ తరం శోభన్ బాబు చాలా అందంగా ఉన్నారు. బహుశా ఆయన మనవడా అన్నట్లు మభ్య పెడుతున్నాడు. అంత సుందరంగా శోభన్ బాబు లుక్ ఉంది. 


 

66
Sobhan Babu

శోభన్ బాబుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన పేరు ఉప్పు కరుణ శేషు. బిజినెస్ మ్యాన్ గా ఆయన రాణిస్తున్నారు. కరుణ శేషు ఫ్యామిలీ డిటైల్స్ తెలిసింది తక్కువే. ఇప్పటికీ తండ్రి ఆదేశాలు పాటిస్తూ ఆయన పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు. 

click me!

Recommended Stories