Laalo: గుజరాతీ సినిమాలో యాభై కోట్లు వసూలు చేస్తేనే అదొక రికార్డు, అదొక సంచలనం. కానీ ఇప్పుడు వంద కోట్లు దాటిందో మూవీ. సరికొత్త హిస్టరీకి శ్రీకారం చుట్టింది. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.
మన వద్ద ఒక సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తే పెద్ద లెక్క కాదు. ఐదు వందల కోట్లు వసూలు చేసినా పెద్దగా పట్టించుకోం. వెయ్యి కోట్లు చేస్తే వాహ్ బాగా చేసిందంటాం. అదే `బాహుబలి 2`, `పుష్ప 2`లా వసూళు చేస్తే రికార్డులుగా చెప్పుకుంటాం. కానీ గుజరాతీ సినిమా(గోలీవుడ్ల్)లో మాత్రం యాభై కోట్లు వసూలు చేస్తే అదొక సంచలనం, అదే వంద కోట్లు చేస్తే అదొక హిస్టరీ. అలాంటి హిస్టరీని తాజాగా ఒక సినిమా క్రియేట్ చేసింది. ఏకంగా రూ.120 కోట్లు వసూలు చేసి గోలీవుడ్ కి `బాహుబలి`లా నిలిచింది.
24
లాలో సరికొత్త సంచలనం
గుజరాతీ సినిమా దశ దిశని మార్చిన మూవీ `లాలో. `శ్రీ కృష్ణ సదా సహాయతే` అనేది ట్యాగ్ లైన్. డివోషనల్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. దీనికి అంకిత్ సాఖియా దర్శకత్వం వహించారు. కృషాన్ష్ వాజా, అంకిత్ సాఖియా, విక్కీ పూర్ణిమా రైటర్స్. ఇందులో రీవా రచా, శృహద్ గోస్వామి, కరణ్ జోషి, మిస్తీ కడేచా ప్రధాన పాత్రలు పోషించారు.
34
లాలో మూవీ కథ ఇదే
ఈ సినిమా ఒక రిక్షా డ్రైవర్ జర్నీని ఆవిష్కరిస్తుంది. రిక్షా డ్రైవర్ అనుకోకుండా ఓ ఫామ్ హౌజ్ లో ఇరుక్కుంటాడు. దాన్ని లాక్ వేసి వెళ్లిపోతారు. దీంతో అందులో నుంచి బయటకు రాలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. దీంతో ఆ హౌజ్‌లో అతను ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించాడు, ఎలాంటి శక్తులతో యుద్ధం చేయాల్సి వచ్చింది, తనని తాను ఏం తెలుసుకున్నాడు, శ్రీకృష్ణుడిని ఎలా చూడగలిగాడు, చివరికి తనలో వచ్చిన రియలైజేషన్ ఏంటనేది సినిమా. శ్రీకృష్ణుడికి సంబంధించిన దైవత్వం ప్రధానంగా ఈ మూవీ రూపొందింది.
రిక్షా డ్రైవర్‌గా కరణ్ జోషి నటించాడు. లాలో(కృష్ణుడు) పాత్రలో శృహద్ గోస్వామి నటించాడు. రీవా రచా కీలక పాత్ర పోషించింది. `లాలో` గతేడాది అక్టోబర్ 10న విడుదలైంది. ఈ సినిమా కేవలం యాభై లక్షలతో రూపొందడం విశేషం. కానీ బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ.120కోట్లు వసూలు చేసింది. గుజరాతీ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచింది. అంతకు ముందు 2019లో `చాల్ జీవీ లైయే` అనే మూవీ రూ.52కోట్లు రాబట్టింది. అప్పటికీ అదొక సంచలనం. ఇండస్ట్రీ హిట్. కానీ ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ వంద కోట్లు దాటిన తొలి గుజరాతీ ఫిల్మ్ గా `లాలో` నిలిచింది. సినీ ప్రియులను, కామన్ ఆడియెన్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఈ మూవీని ఇప్పుడు హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 9న బాలీవుడ్‌లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. అక్కడి ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే ఇది సరికొత్త సంచలనంగా నిలవబోతుందని చెప్పొచ్చు.