
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వసు రిషిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు రిషి మనసులో, మహేంద్ర ని తిట్టిన విషయాలు గుర్తుతెచ్చుకుంటూ డాడ్ వాళ్లు వస్తారంటావా వసుధార. వాళ్ళు నన్ను వదిలేయడమేంటి నేను ఈ మధ్య కొన్ని విషయాల్లో డాడ్ విషయం లో కొంచెం కఠినంగా మాట్లాడాను అది కూడా దేవయాని పెద్దమ్మ విషయంలోనే అని అనుకుంటూ గతంలో మహేంద్ర ని దేవయానికి సారీ చెప్పించిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటూ పెద్దమ్మ కి గౌరవం తగ్గేటట్టు మాట్లాడినందుకు డాడ్ తో కఠినంగా మాట్లాడాను అది తప్పా వసుధార.నేను ఏమైనా తప్పు చేశానా అని అనగా వసు మనసులో, నాకు తెలిసి దీనందరికీ మూలం దేవయాని మేడమే సర్ నాకు గట్టిగా నమ్మకం ఉన్నది మీకు ఏదో రోజు ఆవిడ అసలు రంగు తెలుస్తుంది అని వసు అనుకుంటూ మీరు బాధపడొద్దు సార్ మేడం, సార్ ఎప్పటికైనా దొరుకుతారు అని అంటాది.
అప్పుడు రిషి వసుతో, నువ్వు మీ మేడం మంచి ఫ్రెండ్సే కదా వసుధార ఒకవేళ నీకు గాని వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా అని అడగగా, నన్ను అనుమానిస్తున్నారా సార్ అని వసు అంటుంది. మీరిద్దరూ అన్ని బంధాలను దాటిన గొప్ప బంధం కదా. ఇది చెప్పలేదా అని అనగా నిజంగా నాకు తెలియదు సార్ జీవితాంతం మీతో నడాల్సిందాన్ని నన్ను అనుమానిస్తున్నారా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అని అనగా రిషి, అయితే నీకు చెప్పలేదా వసుధార మేడం కనీసం నీకైనా చెప్పుంటే బాగుండు కదా నేను మేడమ్ కి వర్క్ గురించి మెయిల్ పెట్టాను నువ్వు కూడా పెట్టు. ఈ రకంగా నైనా వాళ్ళు వస్తారు కదా వస్తారంటావా అని ఆలోచనలో పడతాడు రిషి. ఆ తర్వాత కింద కిచెన్లో పాలు పొంగుతూ ఉండగా వసు వెళ్లి స్టవ్ ఆపుతుంది. పక్కనే ఉన్న ధరణి ని చూసి, మేడం మీరు ఇక్కడే ఉన్నారా పక్కనే పాలు పొంగుతున్నాయి కదా.
ఏం ఆలోచిస్తున్నారు అని అనగా, చిన్న అత్తయ్య చిన్న మావయ్య లేనప్పుడు ఇల్లు ఏదోలా ఉన్నది వసు వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు అంటే నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు. నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావో అని అంటుంది. బలహీనంగా ఉన్న సమయంలోనే ధైర్యంగా ఉండాలి మేడం అప్పుడే మనకు ఎదిరించే శక్తి వస్తుంది తట్టుకోగలము అని కాఫీ పెడుతూ రిషి దగ్గరకి వెళ్తూ ఉండగా అదే సమయంలో దేవయాని అక్కడికి వస్తుంది. మీకు కాఫీ కావాలా మేడం అని అనగా, ఇదేమీ నీ రెస్టారెంట్ కాదు నా ఇల్లు నా రాజ్యం నాకు ఏది నచ్చితే చేస్తాను అని దేవయాని అంటుంది. దానికి వసు, థాంక్యూ మేడం మీకు కాఫీ పెట్టే లోపల సార్ కాఫీ చల్లారిపోయేది సమయం మిగిల్చారు అని అంటుంది.అప్పుడు దేవయాని, చెప్పకుండా వచ్చిన అతిథులు ఎన్ని రోజులు ఉంటారేంటి ఈ ఇంట్లో ఇంక వెళ్ళరా అని అడుగుతుంది.
దానికి వసు, ఇప్పుడు అప్పుడే వెళ్ళను మేడం రిషి సార్ ఎప్పుడు నన్ను వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాను. జగతి మేడం, మహేంద్ర సార్ వచ్చేవరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో మీరు కూడా వాళ్ళని వెతకండి నిజంగా నన్ను పంపాలనుకుంటే రిషి సార్ ని అడగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది రోజు రోజు కి బాగా ముదిరిపోతుంది. దీని గురించి కూడా ఆలోచించాలి అని అనుకుంటుంది దేవయాని. తర్వాత వసు పైకి వచ్చి రిషికి కాఫీ ఇస్తుంది.అప్పుడు రిషి పద వసుధార మనము కాలేజ్ కి వెళ్దాము డాడ్ వాళ్లకి అఫీషియల్ గా మెయిల్ పెట్టాను కదా పని విషయం మీద అయినా వస్తారు అని రిషి అంటాడు. అప్పుడు వసు మనసులో, రిషి సార్ మీ మీద నమ్మకంతో ఉన్నారు మేడం కచ్చితంగా రండి వస్తే బాగుండు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో జగతి మహేంద్రలు ఒక ఇంట్లో కూర్చుని ఆలోచనలో ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న గౌతమ్ తో రిషి ఎలా ఉన్నాడు అని అడుగుతారు.
దానికి గౌతమ్, తెలిసిందే కదా మీ గురించే కంగారుపడుతూ అంత వెతికేస్తున్నాడు మీకు మెయిల్ కూడా పెట్టాడు వర్క్ కి కాలేజీకి వస్తారేమో అని అని అనగా రిషి గురించి మాకు తెలుసు.తన తపన మాకు అర్థమవుతుంది కానీ ఇది అవసరం గౌతమ్ వర్షాకాలం అప్పుడే ఎండ విలువ తెలుస్తుంది, ఎండాకాలం అప్పుడే వర్షం విలువ తెలుస్తుంది. ఇలా ఉంటేనే రిషి మమ్మల్ని అర్థం చేసుకుంటాడు అని అంటారు. అప్పుడు జగతి మహీంద్రా తో, మనం గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉండడం గౌతమ్ కి బానే ఉంటుందా? ఇబ్బందేమో?అని అనగా, మిమ్మల్ని నేను సేవించడం నా అదృష్టం మేడం.
కానీ మీరు ఈ సమయంలో ఇక్కడికి రావడం గురించి నేను అడగొచ్చా అడగకూడదా నాకు తెలీదు అని అనగా మహేంద్ర, ఇక్కడొక సమస్య వచ్చింది గౌతమ్ దాని పరిష్కరించడానికి మేము వచ్చాము అందుకే అజ్ఞాతవాసం మాకు తప్పదు మేమిక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు అని అంటాడు. అదే నా బాధ అంకుల్ రిషి అడిగితే నేను అబద్ధం చెప్పలేను అలాగని నిజం దాయలేను అని అంటాడు. ఒక మంచి కోసం ఒక అబద్ధం మంచిదే గౌతమ్ అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత సీన్లో వసు కాలేజ్ బయట కూర్చుని ఆలోచిస్తూ ఒక రకంగా వాళ్ళు వెళ్లిపోవడానికి నేను కారణమేనా!
జగతి మేడం చెప్పినట్టు చీర కట్టుకోలేదని, ఇంకా గురుదక్షిణ ఒప్పందం గురించి నేను పట్టు పడుతున్నానని కూడా వాళ్ళు వెళ్లిపోయి ఉండొచ్చు కదా.ఇదంతా నా వల్లే జరిగిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి అక్కడికి వచ్చి, ఎందుకు వెళ్లిపోయారు వస్తారా నన్ను నినదీసి అడగాలి కదా నేను ఏమైనా తప్పు చేసినట్లయితే. అసలు నేనేం తప్పు చేశాను అని అనగా, వసు దేవయాని గురించి ఆలోచిస్తూ, మీ ముందే సమాధానం ఉన్నది సార్ మీరు తెలుసుకోలేకపోతున్నారు అని అంటుంది. అయితే నాకేం తెలీదు అంటావ వసుధార.
నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను అడగాలి గాని ఇలా వెళ్లిపోవడం ఏంటి అని అనగా, మహీంద్ర సార్ ఎక్కడికి వెళ్లారు అని మీరు అనుకుంటున్నారు సర్ ఎందుకు వెళ్ళుంటారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జగతి మేడం విషయంలో మీ నిర్ణయం మార్చుకుంటే అని వసు అనే లోగా రిషి ఆపి, ఇంకా ఆపేయ్ వసుధార అటువైపు వెళ్ళద్దు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!