Janaki Kalaganaledu: గోవిందరాజులుకి మాట ఇచ్చిన జానకి.. నగలు తాకట్టు పెట్టిన జ్ఞానాంబ?

First Published Jan 7, 2023, 1:23 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 7వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు భారం అంతా రాముడి మీదే పడింది. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వారిని డబ్బులు నేను కూడా అడుగుతాను రాముడికి సహాయంగా ఉంటుంది అని అంటుండగా ఇంతలో అటుగా వెళుతున్న అఖిల్ ఆ మాటలు విని అక్కడే చాటుగా వింటూ ఉంటాడు. అప్పుడు జానకి గోవిందరాజులు కి ఫోన్ ఇవ్వడంతో గోవిందరాజులు తన స్నేహితునికి ఫోన్ చేస్తాడు. అప్పుడు గోవిందరాజులు ఫోన్ మాట్లాడుతూ తన హెల్త్ కండిషన్ గురించి చెప్పి మా చిన్నబ్బాయి అఖిల్ ఉన్నాడు కదా వాడి ఉద్యోగం కోసం పెద్దబ్బాయి రామా 20 లక్షలు పెట్టి మోసపోయాడు. డబ్బులు ఉంటే అడ్జస్ట్ చేస్తావా అని అంటుండగా ఇంతలో అఖిల్ అక్కడికి వస్తాడు. ఏం చేస్తున్నారు నాన్న అనగా భాస్కర్ రావు కి డబ్బులు ఇవ్వాలి కదా అని అనడంతో మీరు డబ్బులు అడగండి.
 

కావాలి అంటే అన్నయ్యకి హెల్ప్ చేయండి కానీ నా వల్లే అన్నయ్య మోసపోయాడు అని ఎవరికి చెప్పకండి నాన్న. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని గోవిందరాజులు అనగా ఇంకెలా మాట్లాడాలి నాన్న. నిజంగానే అన్నయ్య నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే ఇంట్లో అందరికీ చెప్పాలి కదా చేయాల్సినంత చేసి ఇప్పుడు మళ్ళీ నా కోసం చేశానని అబద్ధాలు చెబుతున్నాడు అని అంటాడు అఖిల్. అసలు ఈ గొడవలు అన్నీ పెద్ద వదిన వల్లే అని జానకి నిందిస్తాడు. కానీ నా వల్ల జరిగింది అని చెప్పి నా పేరు చెడగొట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల్. ఇప్పుడు గోవిందరాజులు బాధపడకు జానకి నాకు ఒక మాట ఇస్తావా అనడంతో ఏంటి మామయ్య అనగా ఎప్పటికీ ఈ కుటుంబం ముక్కలు కాకుండా చూసుకుంటానని నాకు పెద్ద కోడలుగా మాట ఇవ్వు అనడంతో జానకి గోవిందరాజులు కి మాట ఇస్తుంది.
 

ఆ తర్వాత జ్ఞానాంబ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. గుడిలో పూజారి గారు చెప్పినట్టు అరిష్టం ఇల్లు చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ విషయంలో నువ్వే ఏదైనా ఒక దారి చూపించమ్మా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు లోపలికి వెళ్తుండగా రామచంద్ర ఎదురుపడడంతో ముఖం ఒకవైపుకు తిప్పుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. ఇప్పుడు రామచంద్ర బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జానకి వస్తుంది. నేను మీ బాధని అర్థం చేసుకోగలను రామ గారు అనడంతో బాధ ఏంటి జానకి గారు మా అమ్మ నన్ను అలా పరాయి వాడాలా చూస్తుంటే నా గుండెను ఎవరు కత్తితో కోసినట్టు ఉంది అని అంటాడు. నాకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఎలా అయినా అప్పు తీర్చి మన కుటుంబాన్ని మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలి అని అంటాడు రామచంద్ర.
 

అప్పుడు డబ్బు కోసం వెళ్తున్నాను అని చెప్పి రామచంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మల్లికా పెద్దమ్మ నేను ఆయన వస్తున్నాము మరి కొద్ది సేపట్లో అక్కడ ఉంటాము నువ్వు అక్కడికి వచ్చేసేయ్ అని చెప్పి మల్లికా లగేజ్ తీసుకొని బయటకు వెళ్తుంది. లగేజ్ అక్కడ పెట్టి విష్ణుని పిలుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గోవిందరాజులు వచ్చి ఏంటమ్మా మల్లిక ఇది అని అడుగుతాడు. అప్పుడు జ్ఞానాంబ సర్ది బయట పెట్టావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. బావగారు ఇంటిని తాకట్టు పెట్టారు రేపు ఎలాగో డబ్బులు కట్టలేము కాబట్టి భాస్కర్ రావు గారు వచ్చి ఇంటిని ఆక్రమిస్తారు. అప్పుడు ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కదా అందుకని ముందుగానే వెళ్ళిపోతున్నాము అత్తయ్య అంటుంది మల్లిక. 
 

నేను మీ అబ్బాయి ఇద్దరం కలిసి  మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాము అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు గోవిందరాజులు అదేంటి మల్లిక ఇటువంటి పరిస్థితులలో అండగా ఉండాల్సింది పోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతే ఎలా అమ్మ అని అంటాడు. అప్పుడు మల్లిక ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి మామయ్య గారు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో విష్ణు అక్కడికి రావడంతో వచ్చారా పదండి బయలుదేరుదాం అని అంటుంది మల్లిక. అప్పుడు జానకి విష్ణు కనీసం నువ్వైనా మల్లికకు నచ్చచెప్పు మీ అన్నయ్య ఎలాగో అలా డబ్బులు తీసుకువచ్చి ఇంటిని కాపాడుతాడు అని అంటుంది.
 

చాల్లే జానకి చేయాల్సింది చేసి ఇప్పుడు మేము  వెళ్లకుండా అడ్డుకుంటున్నావు అనగా అప్పుడు గోవిందరాజులు ఒక్కసారి నా మాట విను విష్ణు ఇంకా ఒక రోజు గడువు ఉంది కదా అంతవరకు ఓపిక పట్టండి అందరూ కలిసి ఈ సమస్యను ఎదుర్కొందామని అంటాడు. ఇవన్నీ అయ్యే పని కాదు మనం వెళ్ళాం పదండి అనగా ఆవేశపడకు కొంచెం ఆగు అన్నయ్య డబ్బులు కోసం వెళ్ళాడు కదా అని అంటాడు విష్ణు. అప్పుడు జ్ఞానాంబ మీరు అన్నట్టుగా మన వంతు కూడా మనం ఏదో ఒకటి చేయాలి. నగలు పెడితే ఎంతో కొంత వస్తుంది అనడంతో అందరూ వారి గదుల్లోకి బంగారం తీసుకుని రావడానికి వెళ్తారు. అప్పుడు అందరూ కలిసి నగలు తీసుకుని వచ్చి జ్ఞానాంబకు ఇస్తారు. అప్పుడు మల్లిక నగలు ఇవ్వకుండా కేవలం ఒక ఉంగరం మాత్రమే ఇస్తుంది.
 

అప్పుడు జ్ఞానాంబ నేను వెళ్ళి వెళ్లి నగలు తాకట్టుపెట్టి డబ్బు తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు రామచంద్ర డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలోనే జానకి ఫోన్ చేసి ఎక్కడున్నారు రామా గారు అని అడగగా డబ్బు పని మీద తిరుగుతున్నాను చెప్పండి జానకి గారు అని అంటాడు చెప్పండి. అప్పుడు జరిగింది మొత్తం జానకి వివరించడంతో రామచంద్ర బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే కన్నబాబు రామచంద్ర దగ్గరికి వస్తాడు. అప్పుడు రామచంద్ర బయలుదేరుతుండగా ఏ రామా అని పిలుస్తాడు. నీ దగ్గరికి నిన్ను పరామర్శిద్దాం అని బయలుదేరాను రామచంద్ర అని వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటాడు కన్నబాబు. ఊర్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు తల్లి చాట బిడ్డ అయినా రామచంద్ర అందర్నీ మోసం చేసి ఇంటి పరువునే బజారికి ఈడ్చాడు అనే మాట్లాడుకుంటున్నారు అని అంటాడు.

click me!