నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విగ్నేష్ తమిళంలో పలు చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించారు. విగ్నేష్ చివరగా 'కన్మణి రాంబో ఖతీజా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నయనతార, సమంత , విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది.