Janaki Kalaganaledu: కన్నబాబుకు బుద్ధి చెప్పిన జానకి.. జ్ఞానాంబను నిలదీసిన గోవిందరాజులు?

First Published Jan 30, 2023, 11:06 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 30వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో జానకి అత్తయ్య గారు ఇంట్లో ఏది మొదలుపెట్టినా కూడా మీతో మొదలు పెట్టడం మాకు అలవాటు అలాగే మీ చేత్తో వ్యాపారం మొదలుపెడితే అందరికీ బాగా జరిగింది. ఇప్పుడు కూడా మా వ్యాపారానికి మీరు టెంకాయ కొట్టి ఆశీర్వదించండి అత్తయ్య అని అడగగా, అప్పుడు జ్ఞానాంబ బిడ్డ క్షేమాన్ని తల్లే కాదు భర్త క్షేమాన్ని భార్య కూడా కోరుకుంటుంది ఆ టెంకాయ నువ్వే   కొట్టి పూజ ప్రారంభించు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు జానకి అత్తయ్య గారు మంచి జరుగుతుందని చెప్పారు కదా అదే ఆశీర్వాదం అనుకొని మనం మొదలుపెడదాం రండి రామాగారు అంటుంది.
 

అప్పుడు రామచంద్ర మీరైనా టెంకాయ కొట్టండి నాన్న అనడంతో సరే వెళ్దాం పద అని అంటారు. అందరూ కలిసిబండి దగ్గరికి వెళ్లి పూజ చేస్తూ ఉంటారు. అది జ్ఞానాంబ లోపలి నుంచి చూసి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు జానకి పూజ చేస్తూ ఉండగా అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు జానకి ఇక బయలుదేరుదామా అనగా వెంటనే గోవిందరాజులు రోజురోజుకీ నీ వ్యాపారం మరింత డెవలప్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు వెన్నెల డబ్బులు ఇచ్చి మొదటి బోని నాదే కాజా కావాలి అని కొనుక్కోవడంతో అది చూసి జ్ఞానాంబ సంతోషపడుతూ ఉంటుంది. అన్నయ్య అమ్మ నీతో మాట్లాడకపోయినా నువ్వేం బాధపడకు అమ్మ పేరు బండి పైన ఉంది కదా మీకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది వెన్నెల.
 

అప్పుడు రామచంద్ర నువ్వే ఎదురు రా అమ్మ అని పిలుస్తాడు. అప్పుడు జానకి వాళ్ళు బండి తోసుకొని వెళుతుండగా అది చూసి జ్ఞానాంబ దేవుడిని బాగా జరగాలని మొక్కుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర వాళ్ళు అక్కడ నుంచి వెళ్తుండగా అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లిక ఏంటి మామయ్య గారు మీరు అయినా చెప్పాలి కదా ఆ బండిమీద స్వీట్లు అమ్మితే 20 లక్షలు అప్పు తీరుతుందా అని అనడంతో పోయిన డబ్బు అంతా కూడా ఆ బండి ద్వారానే సంపాదించాడు అని అంటాడు. అందరూ చనిపోయారు చూస్తాం కదా 20 లక్షలు అప్పు ఎలా తీరుస్తాడు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
 

ఇప్పుడు గోవిందరాజులు మీ అన్నయ్యకు ఆ బండి ఎంత ఇష్టమో మనకు ఎంత కలిసొచ్చిందో నీకు తెలుసు కదా అనడంతో వెంటనే విష్ణు ఇప్పటికే మీరు అన్నయ్యని పొగుడుతుంటే నా భార్య దృష్టిలో చేరతగాని వాడిని అయ్యాను ఇప్పుడు అన్నయ్య గురించి పొగుడుతూ మాట్లాడితే ఇంకా నన్ను పట్టించుకోదు అని అంటాడు. అన్నయ్య మాత్రమే కాదు మేము కూడా కష్టపడ్డాము అని అఖిల్ విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు జానకి, రామచంద్ర ఇద్దరూ బండి తోసుకొని వెళుతుండగా ఇంతలో కస్టమర్స్ వచ్చి స్వీట్లు కొనుక్కుంటూ ఉండటంతో అది చూసి రామచంద్ర జానకి సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే కన్నబాబు రామచంద్ర వాళ్ళ బండికి కారు అడ్డుగా పెడతాడు.

అప్పుడు కన్నబాబు నవ్వుకుంటూ ఏంటి రామచంద్ర జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టావు మళ్ళీ అక్కడికే వెళ్లావు అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు కన్నబాబు బండికి రంగులు వేస్తే కొత్త బండిలా కనిపిస్తుంది కానీ బతుకులు మాత్రం అవే కదా అంటూ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటాడు. నీలాంటి బండ్లు వీధికి నాలుగు ఉన్నాయి అనడంతో నా దగ్గర కొనే వాడు కొంటాడు మర్యాదగా తప్పుకో అని అంటాడు రామచంద్ర. అప్పుడు జానకి మేము నీ సలహా అడిగామా వెళ్లి పని చూసుకో అనడంతో వెంటనే కన్నబాబు బతుకులు రోడ్డు మీదకు వచ్చిన నీ భార్యకు పొగరు మాత్రం తగ్గలేదు అని అంటాడు. ఇద్దరు బండి మీద కూర్చుంటే ఎలా రామచంద్ర నీ భార్యకు కూడా బజ్జీల షాప్ పెట్టించు ఆడది అందులో అందగత్తె కదా అనడంతో రామచంద్ర కన్నబాబు కాలర్ పట్టుకుంటాడు.
 

రామగారు మామూలే వీధి కుక్కలు మొరుగుతుంటాయి అనడంతో పెద్దగా అరవకు కుక్కలు చూస్తే ఫీల్ అవుతాయి అని అంటుంది జానకి. అప్పుడు జానకి కన్నబాబుకు తగిన విధంగా బుద్ధి చెప్పడంతో కన్నబాబు తలదించుకుంటాడు. పని పాట లేని వాళ్ళు విధికి నలుగురు ఉంటారు వాళ్లతో మనం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వెళ్దాం పదండి అని జానకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు జ్ఞానాంబ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు గోవిందరాజులు అక్కడికి వచ్చి నువ్వు ఇలా చేయడం కరెక్టేనా జ్ఞానం అని అంటాడు. వాళ్ళు నేను అడిగింది ఆశీర్వాదమే కదా జ్ఞానం ఆశీర్వదించుంటే ఏమయ్యింది అని అంటాడు. వాళ్ల గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వాళ్లకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అనడంతో తెలిసే మౌనంగా ఉన్నాను అంటుంది జ్ఞానాంబ.
 

అసలు నీకు ఏమయ్యింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని నిలదీస్తాడు గోవిందరాజులు. రామచంద్ర చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజం వేసుకున్నాడు ఇప్పుడు ఒక చిన్న తప్పు వల్ల మళ్ళీ అదే స్థానానికి వచ్చాడు అని బాధపడుతూ మాట్లాడుతుంది జ్ఞానాంబ. ఆరోజు అంత బాగా బతికిన వాడిని చూసి ఈరోజు ఇలా చూస్తుంటే నన్ను ఎలా ఆశీర్వదించమంటారు అని అంటుంది. రామా మంచితనమే వాడిని ఈరోజు స్థాయికి తీసుకోవచ్చింది తమ్ముడు కోసం మంచి చేయాలని చూశాడు కానీ ఇలా జరిగింది అని అంటుంది జ్ఞానాంబ. రామచంద్ర కు జానకి తోడుగా ఉంటుంది ఆ విషయంలో నాకు భయం ఏమీ లేదు నాకు మిగిలిందంతా ఇద్దరు కొడుకుల గురించి అని అంటుంది జ్ఞానాంబ.

మరొకవైపు మల్లికా నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఈరోజు వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తాను. అప్పుడు మల్లిక డబ్బులు తీసి విష్ణుకి ఇచ్చి ఈ డబ్బులు తీసుకెళ్లి షాప్ కి అడ్వాన్స్ కట్టండి అని అంటుంది. అది కాదు మల్లిక ఇన్ని రోజులు రూపాయి కూడా డబ్బులు లేదని చెప్పాము ఇప్పుడు ఇంత అమౌంట్ కడితే ఎలా అని అనడంతో మల్లిక విష్ణు మీద సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు ఏంటో చెప్పిన వినిపించుకోకుండా మల్లిక ఎంత చెప్పిన డబ్బులు చీటిల్ పెట్టి వెళ్లి అడ్వాన్స్ కట్టి రండి అని చెబుతుంది. మరొకవైపు జానకి వాళ్ళు సంతోషంగా స్వీట్లు అమ్ముకుంటూ ఉంటారు. వ్యాపారం బాగా జరుగుతుండడంతో అది చూసి సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే తెలిసిన వ్యక్తులు రావడంతో మాకు కొంచెం సహాయం కావాలి. ఏవైనా పెళ్లిళ్లకు ఫంక్షలకు ఆర్డర్లు చెప్పండి బాబాయ్ స్వీట్లు తయారు చేస్తాము అనడంతో సరే అని అంటారు.

click me!