ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు ఈ డోర్ దగ్గర నన్ను గొంతు పిసుక్కొని చచ్చిపోమంటారా అప్పుడేనా మీ కోపం తగ్గుతుందా అని అనడంతో పరంధామయ్య భయపడుతూ ఉంటాడు. దయచేసి రండి నాతో పాటు మన ఇంటికి వెళ్దాం రండి అనడంతో పరంధామయ్య నేను నీతో కలిసి గడపాల్సిన సమయం గడిపాను నీతో నడవాల్సిన రోజులు నడిచాను ఇంకా నువ్వు ఒంటరిగా నడవాలి నేను కూడా ఒంటరిగా నడుస్తాను. నువ్వు ఒంటరిగా చావాలి నేను కూడా ఒంటరిగానే చూస్తాను అని అంటాడు. అప్పుడు అనసూయ మీకు చేతులు జోడించి అడుగుతున్నాను అని తలుపులు బాధతో ఇంటికి రండి అని అంటుంది. తులసి తలుపులు తెరువు తులసి నేను ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా ఇక్కడే ఇలాగే ఉంటాను.