Janaki Kalaganaledu: నయం అయిన గోవిందరాజులు ఆరోగ్యం.. సంతోషంలో జ్ఞానాంబ?

First Published Feb 1, 2023, 10:38 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 1వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో జానకి ఏంటి పద్మ ఎదురుగా ఫ్రెండ్ వస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అనడంతో అప్పుడు పద్మ నాన్నకి వెన్నునొప్పి కదా, రోజు బాగా అల్లాడిపోతున్నారు అనడంతో అవును ఆ నొప్పి ఎలా ఉంటుందో నేను కూడా చూశాను అంటుంది. మా మావయ్య గారిని చూస్తున్నాను కదా అనడంతో వెంటనే పద్మ కొత్తగా మన ఆత్రేయపురం హాస్పిటల్ కి డాక్టర్ గారు వచ్చారు. ఇటువంటి కేసుల్లో ఆయన స్పెషలిస్ట్. చైర్ ల్ప్ కూర్చుని జీవితాంతం లేవలేరు అనుకున్న వారికి కూడా నయమవుతుందట అనడంతో జానకి లోలోపల సంతోష పడుతూ ఉంటుంది. వెంటనే ఈ విషయం ఎలా అయినా రామా గారికి చెప్పాలి అనుకొని జానకి అక్కడి నుంచి బయలుదేరుతుంది.
 

మరొకవైపు జెస్సి అవును నాన్న ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి. బావగారు ఒకరే కష్టపడుతున్నారు అని అంటుంది. అఖిల్ ఏ పని చేయకుండా కూర్చుంటే చూడడానికి నాకు కూడా బాధగా ఉంది ఏదో ఒక జాబ్ చూడండి నాన్న అంటుంది జెస్సి. ఇంతలోనే అక్కడికి అఖిల్ వస్తాడు. ఏంటి జెస్సి ఇంట్లో అందరూ కట్టకట్టుకొని నా పరువు తీయాలని చూస్తున్నారా అనడంతో జాబ్ అడగడం తప్ప అఖిల్ అనడంతో నేను జాబులు చూసుకుంటున్నాను నా స్థాయికి తగ్గట్టు జాబు రావడం లేదు అనగా ఇంట్లో కూర్చుంటే జాబ్స్ రావు అఖిల్ అందుకే నేను కూడా నా ప్రయత్నం చేస్తున్నాను అంటుంది జెస్సి. అంత పౌరుషం ఉన్నవాడివి ఒకరిని అడిగితే ప్రెస్టేజ్ పోతుంది అనుకున్న వాడివి నువ్వే వెళ్లి జాబ్ చూసుకో అని అంటుంది.
 

అప్పుడు అఖిల్ చివరికి నువ్వు కూడా నన్ను అనేదానివి అయ్యావు అంత చీప్ అయ్యానా అని అంటాడు. అప్పుడు ఆవేశంతో చిటికెలు వేసి జెస్సికి ఛాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అఖిల్. మరొకవైపు జెస్సి రామచంద్ర దగ్గరికి వెళ్లి పద్మ చెప్పిన విషయాలు చెప్పడంతో రామచంద్ర సంతోష పడుతూ ఉంటాడు. రేపే మనం మావయ్య గారిని డాక్టర్ గారి దగ్గర పిలుచుకొని వెళ్దాము అనడంతో సరే జానకి గారు అని అంటాడు. తర్వాత జానకి,రామచంద్ర, జ్ఞానాంబ,గోవిందరాజులు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లడంతో డాక్టర్ గోవిందరాజుల్ని పరిశీలిస్తాడు. ఇప్పుడు గోవిందరాజులు ని చెక్ చేసిన డాక్టర్ ఫిజియోతెరఫీ వాడుతూ కొన్ని మెడిసిన్స్ వాడితే ఎప్పటిలాగే మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది అనడంతో జానకి జ్ఞానాంబ వాళ్లు సంతోష పడుతూ ఉంటారు.
 

మా నాన్న తొందరగా కోలుకోవాలి డాక్టర్ ఎంత ఖర్చయినా పర్లేదు అని రామచంద్ర అనడంతో సరే అని కొన్ని మెడిసిన్స్ రాసిస్తారు. ఆ తర్వాత రామచంద్ర వెళ్దామా నాన్న అనడంతో డాక్టర్ డబ్బులు మందులు ఎలా రామా అనడంతో సంపాదిస్తున్నాను కదా నాన్న అని అంటాడు. అలా ఉన్న డబ్బులని ఖర్చు పెడితే ఎలా రామచంద్ర అని అనడంతో నాకు డబ్బు లేదంటే మీరే ఇంపార్టెంట్ మావయ్య అంటుంది జానకి. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన జానకి గోవిందరాజులు కాళ్ళకి, చేతులకి నూనెతో డాక్టర్ చెప్పిన విధంగా  చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ అక్కడికి వచ్చి నేను చేస్తాను జానకి నువ్వు పక్కకు జరుగు అనడంతో పర్లేదు అత్తయ్య గారు నేను మా నాన్నకు బాగో లేకపోయినా నేను చేయనా అనడంతో జ్ఞానాంబ,  గోవిందరాజులు సంతోషపడుతూ ఉంటారు.

ఆ తర్వాత గోవిందరాజులు స్టాండ్ సహాయంతో పైకి లేచి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉండగా మామయ్య మీరు కచ్చితంగా నిలబడతారు లేచి నిలబడండి అంటూ జానకి రామచంద్ర ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు పైకి లేచి నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. జానకి నేను నిలబడలేక పోతున్నాను నా బతుకు ఇంతే అనడంతో లేదు మావయ్య గారు మీ వల్ల అవుతుంది. లేచి నిలబడండి అని అంటుంది. తర్వాత గోవిందరాజులు అతి కష్టం మీద లేచి నిలబడడంతో అది చూసి జ్ఞానాంబ అందరూ సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు రామచంద్ర స్వీట్ కొట్టు దగ్గర స్వీట్లు అమ్ముతూ ఉంటాడు. అప్పుడు జానకి గోవిందరాజులు నడిపిస్తూ ఉంటుంది. మరోవైపు రామచంద్ర వ్యాపారం అయిపోవడంతో డబ్బులు ఎంచుకుంటూ ఉంటాడు.

 ఆ డబ్బులు జ్ఞానాంబకు ఇవ్వడంతో అది చూసి సంతోష పడుతూ ఉంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జానకి వాళ్ళు గోవిందరాజులని పిలుచుకొని హాస్పిటల్ కి వెళ్తారు. అందరూ కలిసి ఇంటికి వెళతారు. అప్పుడు గోవిందరాజులు స్టాండ్ సహాయం లేకుండా రామచంద్ర జానకి చేతులు పట్టుకుని నడవడంతో అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. గోవిందరాజులు అందరి ముందర ఎవరి సహాయం లేకుండా మెల్లగా అడుగులు వేయడంతో అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు సంతోషంతో జానకిని పొగుడుతూ ఈ ఇంటి కోడలు మా ఇంటి మహాలక్ష్మి అని బాగు చేసింది అని సంతోష పడుతూ ఉంటాడు గోవిందరాజులు. ఇప్పుడు మల్లిక కుళ్ళుకుంటూ  నడిపించింది కదా అని ఆవిడ గారిని మహాలక్ష్మిని చేయకండి.

కుర్చీలో కూర్చోడానికి కారణం వాళ్లే కాబట్టి వాళ్లే మీకు ట్రీట్మెంట్ చేయించారు అనడంతో వెంటనే గోవిందరాజులు వెళ్తూ వంకర పోయిన నా కాళ్లు చక్కగా వచ్చేలా చేసేలా మీ ఆవిడ నోరు కూడా వచ్చేలా చూసుకో అని అంటాడు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు కోసం రాగి జావా చేస్తుండగా నేను ఆల్రెడీ చేశాను అత్తయ్య అని జానకి జ్ఞానాంబ కు ఇస్తుంది. ఏది ఇచ్చినా వద్దు అనే అత్తయ్య గారు నేను ఏది ఇచ్చినా తీసుకుంటున్నారు మా మీద అత్తయ్య గారికి కోపం పోయింది అని సంతోష పడుతూ ఉంటుంది జానకి.

click me!