బాలీవుడ్ నటుడు గోవిందా, అతని భార్య సునీత అహుజా పెళ్లయిన 37 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనస్పర్థల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం. ఈ వార్తలపై వాళ్లిద్దరూ స్పందించకపోయినా, సునీత మాత్రం తమ బంధంలో మార్పులు వచ్చాయని చెప్పింది.
బాలీవుడ్ నటుడు గోవిందా, అతని భార్య సునీత అహుజా 37 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై వాళ్లిద్దరూ స్పందించకపోయినా, మనస్పర్థలు, జీవనశైలిలో తేడాల వల్ల గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
24
గోవిందా, సునీత తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచినా, అభిమానులను మాత్రం ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. కానీ, ఇప్పుడు వాళ్లిద్దరూ కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.
34
తాను, గోవిందా కలిసి ఉండట్లేదని సునీత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పిల్లలతో కలిసి ఫ్లాట్‌లో ఉంటున్నానని, గోవిందా దగ్గర్లోని బంగ్లాలో ఉంటున్నాడని తెలిపింది. గతంలో తన పెళ్లి పట్ల నమ్మకంగా ఉండేదాన్నని, కానీ ఇప్పుడు తన భావాలు మారాయని చెప్పింది.
44
వేర్వేరు అలవాట్ల వల్లే తాము దూరంగా ఉంటున్నామని సునీత చెప్పింది. గోవిందా రాత్రిపూట చాలాసేపు మాట్లాడుతూ ఉంటాడని, తనకు మాత్రం ప్రశాంతంగా ఉండాలని ఉంటుందని తెలిపింది. కలిసి ఉన్నా పిల్లలతో పెద్దగా మాట్లాడనని, ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ పోతుందని ఆమె చెప్పింది.