`విశ్వం`లో ఆ సెంటిమెంట్‌ని పట్టుకున్న గోపీచంద్‌, ప్రశాంత్‌ వర్మనే మెస్మరైజ్‌ చేసిన `కలి` ట్రైలర్‌

First Published | Sep 26, 2024, 12:04 AM IST

గోపీచంద్‌ ఈ సారి రూట్‌ మార్చాడు. సెంటిమెంట్‌ని బలంగా పట్టుకున్నాడు. మరోవైపు ప్రశాంత్‌ వర్మ `కలి` ట్రైలర్‌ విడుదల చేయడంతోపాటు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. 
 

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో `విశ్వం` సినిమా చేస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని దోనేపూడి సమర్పణలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ దసరాకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్‌. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పాటని విడుదల చేశారు. `మొండి తల్లి పిల్ల నువ్వు` అంటూ సాగే రెండో పాటని రిలీజ్‌ చేశారు. ఇది ఆద్యంతం హార్ట్ టచ్చింగ్ గా ఉంది. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌చేయండి.

`విశ్వం` సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా'కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మంగ‌ళ‌వారం ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.

'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.  
 


`మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు.

ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకు కమర్షియల్‌ యాక్షన్‌ మూవీస్‌ చేసిన గోపీచంద్‌ ఇప్పుడు సెంటిమెంట్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు.

ముఖ్యంగా కూతురుసెంటిమెంట్, పిల్లల సెంటిమెంట్‌ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు `విశ్వం`లో అదే సెంటిమెంట్‌తో వస్తున్నారట గోపీచంద్‌. దీంతో ఇప్పుడు అసలైన సెంటిమెంట్‌ని పట్టుకున్నాడు గోపీచంద్‌ అంటోంది టీమ్‌. 
 

సంచలన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రిలీజ్‌ చేసిన `కలి` ట్రైలర్ ఎలా ఉందంటే? 

`హనుమాన్‌` సినిమాతో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయాడు ప్రశాంత్‌ వర్మ. ఆ దెబ్బతో బాలీవుడ్‌ సినిమాలు కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు. అలాంటి స్టార్‌ డైరెక్టర్‌ ఓ సినిమా నచ్చిదంటే మామూలు కాదు. తాజాగా ఆయన `కలి` అనే మూవీ ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ఆయనకు బాగా నచ్చిందట.

ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `కలి` మూవీ ట్రైలర్  థ్రిల్లింగ్ గా అనిపించింది. గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. లీడ్ యాక్టర్స్ ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్ బాగా నటించారు. డైరెక్టర్ శి‌వ శేషు, ప్రొడ్యూసర్ లీలా గౌతమ్ వర్మ, మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.

అక్టోబర్ 4న "కలి" సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. నేను కూడా ఈ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నా` అని చెప్పడం విశేషం.  
 

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తే, శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్.

అతని మంచితనం వల్లే ఇబ్బందులు పడుతుంటాడు. 'నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ' ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్. ఆ రాత్రి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. ఈ వ్యక్తి ఎవరు, అతను వచ్చాక శివరామ్ జీవితంలో  ఎదురైన అనూహ్య ఘటనలు ఏంటి అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

`ప్రియదర్శి వాయిస్ ఓ‌వర్ నవ్వించింది. 'మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే...' అనే డైలాగ్ "కలి" కథలోని సోల్ ను చెప్పింది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయ`ని టీమ్‌ తెలిపింది. 
 

Latest Videos

click me!