అర్థరాత్రి వాళ్ళిద్దరితో సోనియా గూడుపుఠాణి.. 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ ట్విస్ట్

First Published | Sep 25, 2024, 10:59 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 24వ రోజు కూల్ గా ఎలాంటి గొడవలు లేకుండా సాగింది. చిన్నపాటి వాగ్వాదాలు తప్పితే ఎలాంటి గొడవలు లేవు. అయితే బిగ్ బాస్ మాత్రం అతి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 24వ రోజు కూల్ గా ఎలాంటి గొడవలు లేకుండా సాగింది. చిన్నపాటి వాగ్వాదాలు తప్పితే ఎలాంటి గొడవలు లేవు. అయితే బిగ్ బాస్ మాత్రం అతి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ సీజన్ మొత్తం టిస్టులే అని బిగినింగ్ లోనే చెప్పారు. దానిని నిజం చేస్తూ వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి బిగ్ బాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ప్రస్తుతం హౌస్ లో కాంతార క్లాన్, శక్తి క్లాన్ ఇలా రెండు టీమ్స్ ఉన్నాయి. కాంతార క్లాన్ చీఫ్ గా సీత అవకాశం దక్కించుకుంది. శక్తి క్లాన్ కి నిఖిల్ చీఫ్ గా ఉన్నారు. ఇతర ఇంటి సభ్యులు ఎవరి క్లాన్ లో మెంబర్స్ గా ఉంటారో నిర్ణయించుకోమని బిగ్ బాస్ తెలిపారు. దీనితో విష్ణుప్రియ, నైనికా, నబీల్, ఆదిత్య, యాష్మి.. సీత క్లాన్ లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. సోనియా, పృథ్వీ.. నిఖిల్ క్లాన్ లోకి వెళ్లారు. 


సీత క్లాన్ ఆల్రెడీ నిండిపోవడంతో ప్రేరణ, మణికంఠలకి ఛాయిస్ లేకుండా పోయింది. ఒక వేళ వీరిద్దరూ సీత క్లాన్ లోకి వెళ్ళాలి అనుకుంటే.. సీత తన క్లాన్ లో ఇద్దరిని నిఖిల్ క్లాన్ లోకి పంపేందుకు అంగీకరించాలి అని బిగ్ బాస్ తెలిపారు. సీత అందుకు ఒప్పుకోలేదు. దీనితో మణికంఠ నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాడు. అయితే ఇక్కడ ప్రేరణ విషయంలో కొంత డ్రామా సాగింది. 

ప్రేరణ మాత్రం తాను సీత క్లాన్ లోకే వెళ్లాలని ఉందని బాధపడుతూ చెప్పింది. దీనితో యాష్మి పైకి లేచి.. సీత ఒప్పుకుంటే నేను ప్రేరణ కోసం నిఖిల్ క్లాన్ లోకి వెళతానని చెప్పింది. దీనితో యాష్మి నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళింది. ప్రేరణకి సీత క్లాన్ లో ఛాన్స్ దక్కింది. అయితే నిఖిల్ క్లాన్ లోకి మణికంఠ, యాష్మి రావడం సోనియాకి అసలు నచ్చలేదు. అర్థరాత్రి నిఖిల్, పృథ్వీ ఇద్దరితూ మీటింగ్ పెట్టి గూడుపుఠాణి సాగించింది. 

మణికంఠ, యాష్మి మన టీంలో ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ చాల డేంజర్. ఇద్దరూ స్పై లాగా బిహేవ్ చేస్తారు. కాబట్టి మన ముగ్గురు విషయాలు మన మధ్యే ఉండాలి అని చెప్పింది. దీనికి నిఖిల్, పృథ్వీ అంగీకరించారు. ఇక మరుసటిరోజు ఉదయం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో హౌస్ లోకి ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నాయి అని ప్రకటించారు. దీనితో ఇంటి సభ్యులు షాక్ కి గురయ్యారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీల సంఖ్య తగ్గించే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది అని తెలిపారు. ఎంత ఎక్కువమంది వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి వస్తే.. అంత ఎక్కువ మంది ఇప్పుడున్న సభ్యులు బయటకి వెళ్లాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ హెచ్చరించారు. 

ఆ సంఖ్య తగ్గించేందుకు రెండు క్లాన్ ల సభ్యులు కొన్ని ఛాలెంజ్ లు గెలవాలి అని బిగ్ బాస్ తెలిపారు. ముందుగా బాల్ పట్టు టవర్ లో పెట్టు అనే టాస్క్ ఇచ్చారు. సీత క్లాన్ సభ్యులు విజయవంతంగా బాల్స్ ని రూల్స్ ప్రకారం టవర్ లో వేశారు. దీనితో 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీల సంఖ్య తగ్గించే ఛాన్స్ వాళ్ళకి దక్కింది. దీనితో ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని తొలగించారు. ఇంకా 11 వైల్డ్ కార్డు ఎంట్రీలు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఫుడ్ టాస్క్ పెట్టారు. నిఖిల్ టీం నుంచి సోనియా.. సీత టీమ్ నుంచి నబీల్ పాల్గొన్నారు. కానీ వీళ్ళిద్దరూ నిర్ణీత టైంలో ఫుడ్ తినలేకపోయారు. 

Latest Videos

click me!