ఇండస్ట్రీలో 23 ఏళ్ళు పూర్తి.. గోపీచంద్ జీవితమంతా బాధపడేది ఆ ఫ్లాప్ మూవీ గురించే, ఏం జరిగిందంటే

First Published | Aug 3, 2024, 10:45 PM IST

అదిరిపోయే కటౌట్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ ఒకరు. అభిమానులు గోపీచంద్ ని మాస్ యాక్షన్ చిత్రాల్లో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. కెరీర్ ఆరంభంలో గోపీచంద్ గుర్తింపు కోసం విలన్ రోల్స్ చేసారు.

అదిరిపోయే కటౌట్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ ఒకరు. అభిమానులు గోపీచంద్ ని మాస్ యాక్షన్ చిత్రాల్లో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. కెరీర్ ఆరంభంలో గోపీచంద్ గుర్తింపు కోసం విలన్ రోల్స్ చేసారు. మహేష్ బాబు నిజం, నితిన్ జయం, ప్రభాస్ వర్షం చిత్రాల్లో గోపీచంద్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. 

గోపీచంద్ ఇండస్ట్రీకి వచ్చి నేటికి 23 ఏళ్ళు పూర్తయింది. దీనితో గోపీచంద్ అభిమానులకు ఎమోషనల్ లెటర్ రాశారు. టాలీవుడ్ నానా జర్నీ 23 ఏళ్లకు చేరుకుంది. ఇండస్ట్రీలో నాకు మద్దతు తెలిపిన న దర్శకులు, నిర్మాతలు, ప్రతి క్రాఫ్ట్ సిబ్బందికి ధన్యవాదాలు. నేను నటుడిగా ఎదిగేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ నాకు తోడ్పాటు అందిస్తూనే ఉంది.  


మీడియా ప్రతినిధులు కూడా నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. ఇక నా అభిమానుల మద్దతు ఎపప్టికీ మరువలేను. వారి ప్రేమ వల్లే కెరీర్ లో ముందుకు సాగుతున్నా. నా బలం నా అభిమానులే. త్వరలో విశ్వం చిత్రంతో కలుద్దాం అంటూ గోపీచంద్ ఎమోషనల్ లెటర్ రాశారు. 

23 ఏళ్ళ తన కెరీర్ లో గోపిచంద్ ఎన్నో హిట్లు, అంతకి మించి పరాజయాలు కూడా ఎదుర్కొన్నారు. హిట్ చిత్రాలని పక్కన పెడితే కొన్ని చిత్రాల రిజల్ట్ ని తాను మరచిపోలేకున్నా అని గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

అందులో గోపీచంద్ ముందుగా చెప్పిన చిత్రం ఒక్కడున్నాడు. బాంబే బ్లడ్ గ్రూప్ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం అంటే గోపీచంద్ కి చాలా ఇష్టం అట. మంచి సక్సెస్ అవుతుందని ఆశించాడట. ఆ టైంలో ఆడియన్స్ కి ఈ చిత్రం సెట్ కాలేదా అనే అనుమానం గోపీచంద్ అన్నారు. ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటె మంచి విజయం సాధించేది అని తెలిపారు. 

Viswam

అదే విధంగా మరో చిత్రం కూడా ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమ్ నందా చిత్రం.. ఈ మూవీలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుని ఉంటే ఇంకా పెద్ద విజయం అయ్యేది అని గోపీచంద్ తెలిపాడు. 

Latest Videos

click me!