ఈరోజు ఎపిసోడ్లో అంకిత కోపంగా నాకు ఫ్రిజ్ కీస్ కావాలి అని అంటుంది. ఎందుకు అని లాస్య అడగగా చెప్తే కానీ ఇవ్వవా అనడంతో రీజన్ చెప్పడానికి నీకు ఏమీ అని అంటుంది లాస్య. చెప్పాల్సిన అవసరం ఏంటి అనడంతో నేను అడుగుతున్నాను కాబట్టి చెప్పాలి అని అంటుంది. ఇన్ని రోజులైనా నేను ఎవరో నీకు తెలియ లేదా అయితే చెప్తాను విను ఈ ఇళ్ళు నాది ఈ ఇంటి యజమాని నేను ఇంట్లో ఏం జరిగినా ఏం మాట్లాడినా అని నా ఆధీనంలో ఉండే జరగాలి అని అంటుంది లాస్య. ఇంతలోనే శృతి, దివ్య పరంధామయ్యలు వస్తారు. అప్పుడు లాస్య మాటలు అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు.