Janaki kalaganaledu: ప్రేమ వ్యవహారం తెలుసుకొని వెన్నెల చెంప పగలగొట్టిన జ్ఞానాంబ.. మళ్ళీ అబద్దం చెప్పిన జానకి,

Navya G   | Asianet News
Published : Feb 08, 2022, 03:10 PM IST

Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమయ్యే  జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక మల్లిక తన భర్తను స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టి తెగ చిరాకు పెడుతుంది. పిచ్చి ఆనందంతో ఉన్న ఈ మల్లికను ఆపడం ఎవరి వల్లా కాదు అంటూ..  స్విమ్మింగ్ పూల్ లో తెగ హడావిడి చేస్తుంది.  

PREV
15
Janaki kalaganaledu: ప్రేమ వ్యవహారం తెలుసుకొని వెన్నెల చెంప పగలగొట్టిన జ్ఞానాంబ.. మళ్ళీ అబద్దం చెప్పిన జానకి,

మరోవైపు జ్ఞానాంబ తన ఫోన్ కోసం వెతుకుతూ ఉండగా ఈ క్రమంలో గ్రీటింగ్ కార్డ్, దాని పైన ఉన్న గిఫ్ట్ ను చూస్తుంది. అంతేకాకుండా డస్క్ లో ఉన్న ఫోటోను కూడా చూసి ఇవన్నీ వెన్నెల దగ్గర ఉండటం ఏమిటి..  అంటే వెన్నెల ఎవరినైనా లవ్ చేస్తుందా అని మనసులో ఆలోచించు కుంటుంది.  ఒకవైపు  రామచంద్ర ' జానకి గారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారో నేను చూసాను.
 

25

అలాంటిది ఇంత సడన్ గా చదువుకొను అని చెప్పారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని ఆలోచిస్తు ఉంటాడు. ఎంత అడిగినా కారణం చెప్పడం లేదని  మనసులో అనుకుంటాడు. ఇక జానకి కూడా కారణం చెప్పనందుకు రామచంద్ర గారు చాలా బాధ పడుతున్నారని. అలానే కారణం చెప్పి తల్లి కొడుకుల మధ్య మనస్పర్థలు తీసుకురాలేనని మనసులో అనుకుంటుంది.
 

35

ఆ క్రమంలోనే  జానకి ఏవండి రామాగారు నన్ను ఎత్తుకుంటే పూలు కోస్తాను అని అంటుంది. ఇక రామచంద్ర ఏకంగా చెట్టు ను ఊపి జానకి పై పూలవర్షం కురిపిస్తాడు. మరోవైపు వెన్నెల,  దిలీప్ కి ఫోన్ చేసి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు అని చెబుతూ ఉండగా ఈలోపు అ విషయం గమనించిన జ్ఞానాంబ వెన్నెల ను చెంప మీద గట్టిగా కొడుతుంది.
 

45

 తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చి ఎల్లుండి నిశ్చితార్థం అని కోపంతో తెల్చేసి చెబుతుంది. మరోవైపు రామచంద్ర, జానకితో  నువ్వు ఐపిఎస్ ఎందుకు చదువనన్నావో కారణం చెప్తేనే పూజలో కూర్చుంటాను లేకపోతే పూజలో కూర్చునే ప్రసక్తే లేదని పట్టుబడతాడు. ఆ క్రమంలోనే మీరు ఇప్పుడు ఐపీఎస్ చేయడానికి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటి అని గట్టిగా నిలదీస్తాడు.
 

55

  ఆ తర్వాత జానకి ఎమోషనల్ అవుతూ.. ప్రేమంటే కారణం చెప్పలేదని కోపం తెచ్చుకోవడం కాదు. చెప్పలేక పోతుందని అర్థం చేసుకోవడం అని బాధపడుతూ చెబుతుంది. ఆ తర్వాత కొంచెం కోపం కొంచెం ప్రేమతో జానకి,  రామచంద్రను పూజకు ఒప్పిస్తుంది కానీ ఈ క్రమంలో జ్ఞానాంబ అమ్మవారి కోసం పెట్టిన నైవేద్యం మిస్ అవుతుంది మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories