Mithila Palkar : గ్లామర్ తో కట్టిపడేస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్ ‘మిథిల పాల్కర్’.. లేటెస్ట్ ఫొటోస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 02:52 PM IST

బాలీవుడ్ నటి ‘మిథిల  పాల్కర్’ త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు సోషల్ మీడియాలోనూ  గ్లామర్ తో నెటిజన్లను ఆకర్షిస్తూ.. తన క్రేజ్ పెంచుకుంటోంది  ‘మిథిల పాల్కర్’.  

PREV
16
Mithila Palkar : గ్లామర్ తో కట్టిపడేస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్ ‘మిథిల పాల్కర్’.. లేటెస్ట్ ఫొటోస్

విశ్వక్ సేన్ హీరోయిన్ ‘మిథిల పాల్కర్’ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో రచ్చచేస్తోంది. బ్యూటీతో నెటిజన్ల గుండెల్ని పిండేస్తోంది.  
 

26

`ఫలక్‌నూమా దాస్`, `హిట్‌` చిత్రాలతో విజయాలు అందుకుని సునామీలా దూసుకొచిన విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) తాజాగా ‘ఓరి దేవుడా’ చిత్రంలో నటిస్తున్నాడు.   
 

36

ఈ మూవీలో విశ్వక్ సేన్ కు జోడిగా నటిస్తోంది ‘మిథిల పాల్కర్’. అందం, అభినయం ఉన్న మిథిల ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. పలువురు అప్ కమింగ్స్ ఫిల్మ్స్ కు ఈమె పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
 

46

`ఓరి దేవుడా`(Ori Devuda) టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేయగా మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుంది. మల్లారెడ్డి మహిళా కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ చిత్ర టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. 
 

56

ఈ చిత్రంలో మిథిలా పల్కర్‌, ఆషా భట్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా మిథిలా పాల్కర్  కు తెలుగులో ఇది తొలి చిత్రం. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకకులను పలకరించడంతో పాటు, టాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వనుంది.  
 

66

సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా పింక్ గౌన్ ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. క్యూట్  లుక్స్ తో కుర్రాళ్లను మైమరిపిస్తుందీ బ్యూటీ.

click me!

Recommended Stories