Janaki kalaganaledu: జ్ఞానాంబ పరువు తియ్యడానికివేసిన మల్లిక మాస్టర్ ప్లాన్.. సక్సెస్ అవుతుందా?

Published : Oct 21, 2022, 12:41 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
18
Janaki kalaganaledu: జ్ఞానాంబ పరువు తియ్యడానికివేసిన మల్లిక మాస్టర్ ప్లాన్.. సక్సెస్ అవుతుందా?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరూ గుడికి వెళ్దామని నిర్ణయించుకుంటారు. అప్పుడు జానకిరామాలు పొంగలి చేయడానికి కావలసిన పదార్థాలన్నీ సంచిలో సద్దుతారు. అప్పుడు జ్ఞానాంబ బయలుదేరుదామా అని అనగా, మల్లిక విష్ణులు కూడా రానివ్వండి అత్తయ్య గారు బయలుదేరుద్దామని జానకి అంటుంది. అదే సమయంలో గదిలో నుంచి మల్లిక బయటికి వస్తుంది. సంచి ఏంటి మల్లిక అని జానకి అనగా, రేపటి నుంచి ఎలాగో విడిపోతున్నాం కదా ఈరోజు దసరా మంచి రోజు అందుకే మా సొంత పొంగలి మేమే చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాము అని అంటారు.
 

28

 అప్పుడు జానకి, అందరూ బయలుదేరుదాము. మల్లిక, జెస్సి ఇద్దరు కారులో కూర్చోండి నేను,  రామ గారు బండి మీద వెళ్తాము అని అనగా, రేపటి నుంచి ఎలాగా వేరు కాపురం పెడతాము కదా మా దారికి మేము పోతాము మమ్మల్ని మాలా ఉండనివ్వండి కుటుంబాలతో కలపొద్దు నేను మా ఆయన ఆటోలో వెళ్తాము అని అంటారు. జానకి ఎంత అడ్డుకున్నా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. తర్వాత జెస్సీని కారులో కూర్చోమని జానకి చెప్పగా జెస్సి సరే అని అంటుంది. కానీ అఖిల్ ఆపి, మనం కూడా రేపటి నుంచి వేరుగా వెళ్తున్నాం కదా నా దగ్గర బండి కూడా లేదు.
 

38

 నడుచుకొని వెళ్లడం నేర్చుకోవాలి అని అనగా జెస్సీ, అలా అంటావేంటి అఖిల్ చిన్నక్క, చిన్న బావగారు ఒక కోపంలో అలా అన్నారు అలాగని మనము అదే మాట మీద ఉంటే మనకే కష్టాలు వస్తాయి వేరు కాపురం మనం చేయలేము అని సలహా ఇస్తుంది. దానికి అఖిల్, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా అని అనగా ఏం చేయలేక అఖిల్ వెన్నంటే వెళ్తుంది జెస్సీ.తర్వాత వాళ్ళిద్దరూ వెళ్లిపోయినప్పుడు జ్ఞానాంబ వేరు కాపురం గురించి మల్లిక మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ గుండె నొప్పితో కింద పడిపోతుంది.
 

48

 అప్పుడు ఇంట్లో వాళ్ళు జ్ఞానాంబ ని లేపి మంచినీళ్లు ఇచ్చి జాగ్రత్త అత్తయ్య గారు అని అంటారు. చూశావా రామా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వేరు కాపురం అంటున్నారు  అని అనగా మనం గుడికి వెళ్దాం అత్తయ్య గారు గుడికి వెళ్ళిన తర్వాత వాళ్లతో మాట్లాడి సమస్య పరిష్కరిద్దాము అని అంటుంది జానకి. వద్దు జానకి నాకు ఇప్పుడు గుడికి రాడానికి ఓపిక లేదు మనసు బాలేదు అని అనగా, రండి అత్తయ్య గారు ఈరోజు విజయదశమి కదా మంచి జరుగుతుంది అని జానకి అంటుంది. ఆ తర్వాత సీన్లో మల్లిక గుడికి వచ్చి బయట నీలావతి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది.
 

58

 ఇంతలో నీలావతి స్నేహితులు ఇద్దరు అమ్మలక్కలు వచ్చి నీలావతి కోసం వెతుకుతున్నావా మల్లిక అది రాలేదు నన్ను పంపించింది అని అనగా,  ఇక్కడ ఒక పెద్ద నాటకం మొదలుపెడితే ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు పెద్దమ్మ అని మల్లికా అంటుంది. దానికి ఆవిడ, ప్రతిసారి నీలావతి మధ్యలో వస్తే తన మీద అనుమానం వస్తుంది అని ఈసారి నన్ను పంపించింది. నీ గురించి కొంచెం కొంచెం చెప్పింది అల్లుకుపోతాను నెమ్మదిగా అని అనగా, నువ్వు నెమ్మదిగా అల్లుకపోయేసరికి రేపు తెల్లారిపోతుంది మూసుకొని చెప్పింది చేయు అని తనకి ఏదో ప్లాన్ చెప్తుంది మల్లిక. 
 

68

ఆ ప్లాన్ చెప్పి తేడా రాకూడదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇది గడుసుదని చెప్పింది గాని మరి ఎంత గడుసు అనుకోలేదు బక్కది అయినా సరే గట్టిగానే ఉంది అనుకుంటుంది ఆ పెద్దమ్మ. ఆ తర్వాత సీన్లో మల్లిక విష్ణులు గుడి దగ్గర పొంగలి చేస్తూ ఉంటారు. అప్పుడు విష్ణు మల్లికతో, అయినా మల్లికా ఎలాగ విడిపోతాం కదా అప్పటివరకు అయినా ఇంట్లో వాళ్ళతో కలిసి పొంగలి చేయొచ్చు కదా అని అంటాడు. దానికి మల్లిక, మీ అమ్మగారు కూడా వేరుకాపురం ఒప్పుకున్నారు కదా ఇంకేం అవసరం లేదు లెండి వాళ్ళతో ఉండడం అని అంటుంది.
 

78

అదే సమయంలో జానకి వాళ్ళు అక్కడికి వస్తారు.ఇప్పుడు మాట్లాడమని సైగ చేస్తుంది మల్లిక.అప్పుడు ఆ పెద్దమ్మ వస్తున్నాను వస్తున్నాను అని చెప్పి ఆ మధ్యలోకి దూరి, ఏంటి మల్లికా ఒక్కదానివే పొంగలి చేస్తున్నాము. ఎప్పుడు ఇల్లంతా కలిసే వచ్చేవారు కదా ఈసారి వేరువేరుగా ఎందుకు వస్తున్నారు ఏం జరుగుతుంది అని అనగా,  సిరి ఉంటే పరమన్నం, కరువస్తే గంజన్నం అన్నట్టు అన్ని రోజులు ఒకేలా ఉండవు పెద్దమ్మ అని అంటుంది మల్లిక. ఏం మాట్లాడుతున్నావ్ మల్లిక అన్ని రోజులు ఒకేలా ఉండకపోవడం ఏంటి. ఇద్దరి మధ్య ఏమైనా అయిందా అని అనగా, అసలు ఏం జరిగిందంటే అని మల్లిగా చెప్పేలోక జానకి మల్లికని ఆపి సరదాకి కూడా ఒక హద్దు ఉంటుంది మల్లిక అని చెప్పి ఆ పెద్దమ్మతో,  మల్లిక కడుపుతో ఉన్నది కనుక మల్లిక ఈ పనిచేస్తే ఇంటికి మంచి జరుగుతుంది అని అత్తయ్య గారు చెయ్యమన్నారు. 

88

అయినా మీరు పక్కవారి విషయాల్లో దూరడం అంత మంచిది కాదు ముందు మీ గురించి మీరు చూసుకోండి తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచించవచ్చు అని ఆ పెద్దమ్మని అంటుంది జానకి.  అయినా మాకెందుకులే అమ్మ మీ ఇంటి విషయాలు అని చెప్పి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఆ పెద్దమ్మ. అప్పుడు జానకి మల్లికతో, ఇంట్లో ఏమున్నా లేకపోయినా సరే బయట వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు మల్లికా రేపటి వరకు ఇంకేమీ మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళతో కలువు. కలిసే ఇంట్లో పూజలని చేయు అని అనగా, ఇప్పుడు కూడా నా మీద పెత్తనం చెలాయిస్తున్నావ్  ఏంటి జానకి అని మల్లిక అరుస్తుంది. దానికి జ్ఞానాంబ, చెప్పింది చెయ్ మల్లికా జానకి ఏం చెప్తే అది చేయు అని అనగా, ఇష్టం లేకపోయినా అలాగే అత్తయ్య గారు అని గీరగా అంటుంది మల్లిక. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ గుడిలో తల పైన బోనాలు పెడుతూ నడుస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories