
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..తులసి పరంధామయ్యతో, అయినా ఇప్పుడు ఇల్లు నాకెందుకు ఇవ్వాలనిపించింది మావయ్య అని అడుగుతుంది.దేవుడికి గుడి కట్టడానికి కారణాలు కావాలా చెప్పు. అందరూ బయటికి నవ్వుతూనే మాట్లాడుతున్నాను కానీ అవి మనసు నుంచి వచ్చిన నవ్వులు కాదు నాకు నీ గురించి భయం వేసింది నీకు ఎప్పటికైనా ఈ ఇల్లు అవసరం ఉన్నది అనిపించి కొన్నాను అని అంటాడు.అప్పుడు తులసి, అత్తయ్య గురించే మీరు మాట్లాడుతున్నారు కదా మావయ్య. అత్తయ్య మాట కొంచెం గట్టిగా ఉన్నా మనసు చాలా మంచిది ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారు అని అంటుంది. అప్పుడు అనసూయ, ఏంటి మామ కోడళ్లు ఏవో మాట్లాడుకుంటున్నారు మమ్మల్ని ఇక్కడ పడేసారు మా సామాన్లు ఎవరు తెస్తారు అని అడగగా, మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన వాడిని మీ సామాన్లు ఎలా రప్పించాలో నాకు తెలియదేంటి. ప్రేమ్, అభి ఏజెన్సీ వాళ్లకు ఫోన్ చేసి మన సామాన్లు తెమ్మన్నాను ఆ పనులు చూడండి అని అనగా వాళ్లు సరే అంటారు. ఆ తర్వాత సీన్లో నందు లాప్టాప్ లో కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటూ ఉంటాడు. లాస్య,నందు పక్కనే కూర్చుంటుంది.
అప్పుడు భాగ్య అక్కడికి వచ్చి మీరేమో డబ్బులు లేక ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు అక్కడేమో తులసి అక్క కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశాలు కూడా చేస్తుంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని అనగా స్వయానా మావయ్య గారే తులసక్కకి ఇల్లు కొనిచ్చారు అని భాగ్య అంటుంది. దానికి లాస్య, విషయం ఏమైనా నమ్మేటట్టు చెప్పు మందులు కొనడానికే ఖాతా రాసుకునే మావయ్య ఇల్లు కొన్నారంటే ఎలా నమ్ముతాను అని అనగా భాగ్య ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొచ్చి చూపిస్తుంది. మనల్ని పిలవకపోయినా కనీసం ఇల్లు కొంటున్నట్టు చెప్పాలి కదా అని అనగా నందు సైలెంట్ గా ఉంటాడు.ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడవేంటి నందు ఏమైనా చెప్పు అని లాస్య అనగా, నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావు లాస్య నాన్న డబ్బులు నాన్న ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్లకు ఇస్తారు. మధ్యలో మనకేం హక్కు ఉన్నది అని అంటాడు. దానికి లాస్య, అక్కడ సామ్రాట్ చేసిన అవమానం కన్నా ఇది పెద్ద అవమానం. సొంత కొడుకులు ఉండగా కోడలు కాని కోడలికి ఇవ్వడం ఏంటి అడగడానికి మనం లేమని అనుకుంటున్నారా రా నందు మనం వెళ్లి అడుగుదాము అని అంటుంది లాస్య.దానికి నందు, నేను రాను నన్ను లాగొద్దు అని అనగా భాగ్య, రండి బావగారు నేనూ, లాస్య మాట్లాడుతాము.
మేము మాట్లాడింది తప్పనిపిస్తే మాకు చెప్పండి చాలు ఇంకేం మీరు మాట్లాడొద్దు మాకు తోడుగా ఉంటుంది అని అంటుంది.ఆ తర్వాత సీన్లో తులసి ఇంటికి దీపం పెట్టి హారతి ఇస్తుంది. హారతి తీసుకోండి మావయ్య అని అనేలోగ సామ్రాట్ వచ్చి హారతి తీసుకొని ఇంట్లో మొదటి హారతి నేనే తీసుకున్నాను అని నవ్వుతాడు. అప్పుడు అనసూయ, రామేశ్వరం వెళ్ళినా సోమేశ్వరం వదలనట్టు ఉన్నది అని అనుకుంటుంది. అప్పుడు తులసి, నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అని అనగా, దీని అంతటికి మూలం సామ్రాట్ ఏ అమ్మ అని పరంధామయ్య అంటాడు.ఏం మాట్లాడుతున్నారు మావయ్య ఏమైంది అని అనగా కోర్టు దగ్గరనుంచి ఈ స్థలాన్ని సామ్రాట్ గారే కొని నాకు అమ్మారు అమ్మ. ఇదంతా సామ్రాట్ వల్లే అయింది అని అనగా, వెనకనుంచి లాస్య చప్పట్లు కొట్టుకుంటూ భాగ్యాన్ని ఇంకా నందుని తీసుకొని వస్తుంది. బాగుంది సామ్రాట్ ఎంత మంచి దయా హృదయం, ఎంత మంచి జాలికలు మనసు, ఎదుటివారికి ఎన్ని సేవలు చేస్తున్నారు అని అంటూ, ఏంటి మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటున్నావా ఆ మర్యాదని నువ్వే తీసేసావు ఇంక నీకు మర్యాద ఇచ్చే అంత స్థాయి నీకు లేదు అని అనగా తులసి మధ్యలో అడ్డుకొని, నా అతిధి మీద కామెంట్ చేసే హక్కు నీకు లేదు లాస్య అని అంటుంది.
దానికి లాస్య, చూసారా అత్తయ్య ఒకసారి అతిధి అంటుంది, ఒకసారి బాస్ అంటుంది, ఇంకోసారి భాగస్వామి అంటుంది. తను క్లారిటీ తీసుకోకుండా పక్క వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది. అయినా మేము ఏమి పరాయి వాళ్ళము కాదు కదా ప్రేమగా పలకరించవచ్చు కదా అని లాస్య అంటుంది.అప్పుడు పక్కనే ఉన్న భాగ్య, మావయ్య గారికి మన మీద అంత అభిమానమే ఉంటే గృహప్రవేశానికి పిలిచేవారు కదా అని అనగా పరంధామయ్య, ఇన్నాళ్లు గుర్తురాని మీకు సడన్గా ఇప్పుడు గుర్తొచ్చామంటే దాని వెనుక కారణం ఏంటో నాకు తెలుసులే అమ్మ అని అంటాడు. దానికి లాస్య, ఎందుకు మావయ్య ఈ పక్షపాతం అసలు కోడల్ని పట్టించుకోకుండా కోడలు కాని కోడలికి రాసిస్తున్నారు అని అనగా, మీరు ఎవరు నా గురించి ఆలోచించకుండా నన్ను ఆపరేషన్ అప్పుడు వదిలి వెళ్ళిపోయినప్పుడు తులసి ఈ ఇల్లు అమ్మి అప్పుచేసి ఆపరేషన్ కి డబ్బులు చేర్చింది. అయినా ఈ ఇంట్లో వాటాలు మీకు ఇచ్చాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనగా భాగ్య, పాత ఇంటి మాటలు గురించి మాకు ఎందుకు ఈ ఇంటి వాటాల గురించి మాట్లాడుతున్నాము అని అనగా పక్కనే ఉన్న లాస్య, మేము చాలా సార్లు మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాము మావయ్య.
కానీ తులసి ఎప్పుడూ ఇంటికి తీసుకురానివ్వలేదు. మిమ్మల్ని తనతో ఉంచుకొని ఆస్తంతా కొట్టేసింది తెలివిగా అని అంటుంది. దానికి ప్రేమ్, ఇల్లు ఇచ్చింది తాతయ్య అయితే మా అమ్మని ఎందుకు అంటారు అని అనగా పక్కనే ఉన్న అభి, పెద్దవాళ్ల గొడవలోకి మనకెందుకురా అని అంటాడు. దానికి లాస్య, మీరు మాట్లాడరేంటి అత్తయ్య ఏదైనా చెప్పండి అని అనగా, ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు నా మాటని ఎవరు గౌరవించడం లేదు నా పెద్దరికంకి విలువ లేనప్పుడు. నేను ఎందుకు మాట్లాడడం సైలెంట్ గానే ఉంటాను నన్ను మీ గొడవలలోకి లాగొద్దు. ఏమైనా కావాలంటే మీ మావయ్యనే అడగండి అని అంటుంది. అప్పుడు పరంధామయ్య, ఈ ఇల్లు నా డబ్బులతో నేను కొన్నాను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఎవరికీ ఇవ్వాలనిపిస్తే వాళ్లకు ఇస్తాను అయినా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మారడానికి నేను నందగోపాల్ ని కాదు పరంధామయ్యని అని పరంధామయ్య అనగా, మధ్యలో నన్నెందుకు తెస్తున్నారు నాన్న అని నందు అంటాడు. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అయితే మమ్మల్ని నిలదీయు లేకపోతే మమ్మల్ని నిలదీస్తున్న వారి నోరు మూయు అంతేగాని మౌనంగా కూర్చోవద్దు అని అంటాడు.
అప్పుడు భాగ్య, దాని గురించి కాదు ఈ ఇంటి గురించి కనీసం మమ్మల్ని సరదాకైనా రమ్మని అడగొచ్చు కదా ఏది ఏమైనా ఆస్తి కొడుకులకు కాకుండా తులసి అక్కకు ఇవ్వడం చట్ట ప్రకారంగా చెల్లదు అని అనగా సామ్రాట్, చట్టాల గురించి మీకు అసలు తెలుసా అని అడుగుతాడు. దానికి నందు మాట్లాడుతూ, మీకు ఇంటికి ఏ సంబంధం లేదు మౌనంగా ఉండండి అనవసరంగా లేనిపోని విషయాల్లో తలదొడ్చుకోవద్దు మీకు ఏ అర్హత లేదు అని అనగా పరంధామయ్య అడ్డుకుంటూ, నీకన్నా ఎక్కువ అర్హత ఉన్నది. నువ్వు దాన్ని ఒంటరిగా వదిలేసినప్పుడు సామ్రాట్ వచ్చి ఆదుకున్నాడు. తనకి జీవితానికి ప్రసాదించాడు నీలాగ దారిలో వదిలేసి ఇంకొకరి కోసం వెళ్ళిపోలేదు అని అనగా నన్ను తిట్టాలనుకుంటే తిట్టండి కానీ ఇలాంటి నీచమైన మనుషులతో నన్ను పోల్చకండి అని నందు అంటాడు. అప్పుడు లాస్య, ఎవరి మనసులో ఏమున్నాదో అందరికీ తెలుసులే అతనికి డబ్బు ఉన్నది, హోదా ఉన్నది, పలుకుబడి ఉన్నది, ఇష్టమైన సరే స్నేహమనే మూసుకుదో ఆటలు ఆడుతున్నారు అయినా ఈ విషయం తులసి కూడా తెలుసు.తెలిసినా
ఏమీ ఎరగనట్టు బాగా నటిస్తుంది ఇద్దరికి ఇద్దరు చాలా బాగున్నారు.
అయినా ఎందుకు తులసి అంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్. మీరైనా చెప్పండి అత్తయ్య ఈ ఇంట్లో ఎవరికైనా వినే మనసు, ఆలోచించే బుద్ధి ఉన్నదంటే అది మీకే అని అనసూయని కావాలని రెచ్చగొడుతుంది లాస్య. అప్పుడు తులసి, నోరు అదుపులో పెట్టుకో లాస్య అని అనగా నేనెందుకు అదుపులో పెట్టుకోవాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు విని తీరాలి అయినా అసలు సామ్రాట్ నీకేమవుతాడని ఇంతలాగా కలిసి తిరుగుతున్నారు అని అనగా, ఇంక లాపు లాస్య అని తులసి అరుస్తుంది. దానికి నందు, ఎందుకు ఆపాలి ఉన్న మాటే అన్నది కదా సామ్రాట్ కి నీకు స్నేహం ఉంటే అది నీ వరకు ఉంచుకో. కుటుంబ వ్యవహారాలు వరకు తేవద్దు. మా ఫ్యామిలీ ఇష్యూలోకి అతనిని తల దూర్చొద్దు అని చెప్పు అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!