ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki) స్టేజ్ మై బహుమతి తీసుకున్న తర్వాత ఈ అవార్డు నాకు రావడానికి కారణం ఇద్దరు ఒకరు నా భర్త, ఇంకొకరు మా నాన్న అని చెప్పి సంతోషపడుతుంది. జానకి స్పీచ్ చూసి రామచంద్ర ఆనంద పడుతూ ఉంటాడు. తన భర్త గురించి గొప్పగా పొగుడుతూ ఉండగా రామచంద్ర అది చూసి సంతోష పడుతూ ఉంటాడు. అదంతా చూస్తున్నా జ్ఞానాంబ(jnanamba)కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూస్తున్న మల్లిక జ్ఞానాంబను మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.