తెలుగు బ్యూటీ అంజలి గురించి పరిచయం అవసరం లేదు. జర్నీ చిత్రంతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, మసాలా లాంటి చిత్రాలు అంజలి ఇమేజ్ పెంచాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. నటనతో ప్రతి ఒక్కరిని మెప్పించింది.