ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki),రామచంద్ర తో మాట్లాడుతూ ముందు అత్తయ్య గారికి ఇచ్చిన మాట మీద నిలబడదాము. పని మొదలు పెడదామా అని అనగా రామ ఏంటి అని అనడంతో జానకి పిల్లల విషయం అనటంతో రామ(rama chandra) భయపడుతూ సిగ్గుపడుతూ కనిపిస్తాడు. అలా వారిద్దరూ కాస్త రొమాంటిక్ గా ఉండగా అప్పుడు రామచంద్ర దూరం జరిగి మీరు అదేదో రాయాలి అన్నారు కదా ఆ పని మీద ఉండండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.