వైరల్ ఫొటోలు: 'కంచె' కుర్రది..బికినీ వేసి కాక పుట్టిస్తోంది
First Published May 29, 2020, 11:10 AM IST
వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. అందులో నటించిన ప్రగ్యా జైస్వాల్ సైతం అందరినీ తన నటన, అందంతో ఆకట్టుకుంది. అయితే ఆమె తెలుగులో సినిమాలు ఏమీ చెయ్యకపోవటంతో వార్తలేమీ వినిపించటంలేదు. అయితే ఇప్పుడు ఆమె లాక్ డౌన్ టైమ్ లో స్వయంగా క్వారంటైన్ కు వెళ్లటంతో వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయటంతో జనాలకు గుర్తు వచ్చింది. ఆ ఫొటోలు కూడా మామూలుగా లేవు. బికినీ వేసి బీబత్సం చేసే పనిలో పడింది. ప్రగ్యా జైస్వాల్ కు కంచె ఇమేజ్ దాటాలని ఉంది.. ట్రెడిషనల్గానే కాదు.. ట్రెండీగా కూడా అందరూ తనను ఇష్టపడాలని ఉంది. అయితే మళ్లీ అంత పేరు తెచ్చే పాత్ర పడటం లేదు. దాంతో ఇదిగో నేను ఇలా కూడా మీకు తెరపై కనిపించి అలరించగలను అన్నట్లు ఊరిస్తోంది. అసభ్యంగా ప్రవర్తించనంతవరకూ ఏదైనా బాగానే ఉంటుంది. ఆటోగ్రాఫ్స్ ఇవ్వడానికి, ఫొటోలు దిగడానికి ఇబ్బంది ఏం ఉంటుంది? అని చెప్తున్న ఆమె ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.