`నన్ను ల** ము** అని తిట్టే అసభ్యులకు ఓ దండం`

First Published May 29, 2020, 10:17 AM IST

దక్షిణాదిలో మీటూ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకువచ్చిన గాయని చిన్మయి శ్రీపాద. పలువురు సినీ ప్రముఖులను ఈ వివాదంలోకి లాగిన చిన్మయిపై అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా తన పై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించింది చిన్మయి.

జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ లిరిసిస్ట్‌ వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది గాయని చిన్మయి శ్రీపాద. ఏడాదిన్నర క్రితం ఈ ఆరోపణలు చేసిన చిన్మయిపై అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో తరుచూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
undefined
అయితే చిన్మయి కూడా ఏ మాత్రం వెరక్కి తగ్గలేదు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌కు గట్టిగా బదులిస్తూనే, తనలాంటి బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు గట్టి పోరాటమే చేసింది. అలాంటి వారి కథలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా రచ్చచేసింది చిన్మయి.
undefined
అయితే చిన్మయి చేస్తున్న ఈ పోరాటం వల్ల ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆమె మీద తమిళ డబ్బింగ్ యూనియన్‌ నిషేదం విధించింది. తరువాత ఆమె కోర్టులో పోరాడి తిరిగి మెంబర్ షిప్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా ఆమెకు అవకాశాలు భారీగా తగ్గిపోయాయి.
undefined
గతంలో వైరముత్తును కేంద్ర ప్రభుత్వం సత్కరించిన సమయంలో కూడా చిన్మయి ఘాటుగా స్పందించింది. తొమ్మిది మంది మహిళలను వేదించిన ఓ కామాంధుడిని కేంద్ర ప్రభుత్వం సత్కరించటం అనేది అవమానకరమైన విషయం. నేను న్యాయం కావాలని ప్రశ్నిస్తుంటే ఆ కామాందుడి అభిమానులు నన్ను వేదిస్తున్నారు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
undefined
తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో మరోసారి రియాక్ట్ అయ్యింది చిన్మయి. `నేను బుల్లియింగ్ చేసినట్టు మీకనిపిస్తే నన్ను క్షమించండి. తప్పు చేస్తే క్షమాపణ అడగవలసినదే అని నాకు తెలుసు. నన్ను 'ల.ము'. అని తిట్టే అ-సభుయలకి, మిమ్మల్ని ఇలా తయారుచేసినవాళ్ళకి - మీ సంస్కారానికి ఓ దండం మీకు .(నా ఎకౌంట్ నా కంట్రోల్లోనేఉంది)` అంటూ కామెంట్ చేసింది.
undefined
అంతేకాదు తనపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బూతులను కూడా తన పేజ్‌లో షేర్ చేసింది చిన్మయి. చెప్పడానిక విల్లేని భాషల్లో తనను అవమానకరంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
undefined
click me!