Girija Oak: సోషల్ మీడియా టచ్ ఉన్న ప్రతీ ఒక్కరికీ గిరిజ ఓక్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక చిన్న వీడియోతో రాత్రికి రాత్రి నేషనల్ క్రష్‌గా మారిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
కొంతమందికి తొలి సినిమాతోనే గుర్తింపు వస్తుంది. ఇంకొందరికి పెద్ద హిట్ పడే వరకు సరైన గుర్తింపు రాదు. అయితే గిరిజ ఓక్‌కు ఇది పూర్తిగా భిన్నం. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్‌ల వల్ల ఈ మరాఠి నటి అకస్మాత్తుగా ట్రెండింగ్‌లోకి వెళ్లింది. హిందీ, మరాఠి, కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ ఇంత భారీ అటెన్షన్ ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తే చాలు.. ప్రతీ ఒక్కరి వాల్‌పై ఈ బ్యూటీ కనిపిస్తోంది.
25
“హ్యాపీగా ఉంది… కానీ ఒక సమస్య!”
సడన్‌గా వచ్చిన ఈ ఫేమ్‌పై గిరిజ ఆనందం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ ప్రేమ చూసి షాకయ్యానని చెప్పింది. కాల్స్, మెసేజ్‌లు వరుసగా వస్తుండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. కొన్ని మీమ్స్ చూసి నవ్వుకుందట. అయితే ఈ సరదా మధ్య ఆమెను కలిచివేసిన విషయం కూడా ఒకటుంది. అదే విషయాన్ని గిరిజ ప్రస్తావించారు.
35
ఆ ఫొటోలు నా కొడుకు చూస్తే ఎలా.?
నెట్టింట ట్రెండ్ కావడంతో గిరిజ ఓక్ పాత ఫొటోలను ఏఐ సహాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫొటోలపై గిరిజ అసహనం వ్యక్తం చేశారు. “ఇప్పుడు నా బాబు సోషల్ మీడియా వాడడంలేదు. కానీ రేపు వాడతాడు కదా? అప్పుడు ఇలాంటి ఎడిటింగ్ ఫోటోలు చూస్తే ఎంత బాధపడతాడు?” అని ప్రశ్నించారు
వ్యూస్ కోసం ఇలాంటి అసంబద్ధ ఎడిట్లు చేసే వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. “ఏ అమ్మాయి ఫోటో అయినా ఇలా మార్చే ముందు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పనులు చేసే వాళ్లు తప్పు చేస్తున్నారు. ఆ ఫోటోలను ఆస్వాదించే వాళ్లు కూడా ఈ తప్పులో భాగం అవుతారు” అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో హద్దులు లేకుండా జరుగుతున్న ఈ ప్రవర్తనపై నియంత్రణ అవసరమని సూచించారు.
55
ఫ్యాన్స్‌కు గిరిజ మెసేజ్
తనపై వచ్చిన దృష్టిని పాజిటివ్ దిశలోకి మళ్లించాలని గిరిజ కోరుకుంది. “ఇవన్నీ పక్కనపెడితే, నా సినిమాలు, సిరీస్‌లు చూస్తే నాకు అదే పెద్ద ఆనందం” అని చెప్పుకొచ్చారు. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్‌స్పెక్టర్ జిండె వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన గిరిజ ఇప్పుడు సోషల్ మీడియా దూసుకుపోతోంది.