Ghaati Censor Review: `ఘాటి` సెన్సార్‌ రివ్యూ.. అనుష్క లేడీ పుష్పరాజ్‌.. బ్లాక్‌ బస్టర్‌తో స్వీటి కమ్‌ బ్యాక్‌

Published : Aug 30, 2025, 05:18 PM IST

అనుష్క శెట్టి నటించిన `ఘాటి` మూవీ సెప్టెంబర్‌ 5న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్‌ రివ్యూ ఏంటో తెలుసుకుందాం.  

PREV
15
తనలోని మరో కోణం చూపించబోతున్న అనుష్క

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ `ఘాటి`. క్రిష్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో విక్రమ్‌ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుందని టీజర్‌, ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో అనుష్క పాత్ర కూడా చాలా పవర్‌ ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. టీజర్ లో అనుష్క యాక్షన్‌ సీన్లు మతిపోయేలా ఉన్నాయి.  స్వీటిలోని మరో కోణం చూడబోతున్నామని అర్థమయ్యింది. 

25
`ఘాటి` సెన్సార్‌ టాక్‌

సెప్టెంబర్ 5న విడుదల కాబోతున్న `ఘాటి` సినిమా సెన్సార్‌ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమా నిడివిపై కూడా క్లారిటీ వచ్చేసింది. 2 గంటల 37 నిమిషాల రన్‌ టైంతో థియేటర్లోకి రాబోతోంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్టుగా తెలిసింది. అదే సమయంలో సినిమా నిడివి కూడా డీసెంట్‌గా ఉంది. ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలు మూడు గంటల వరకు ఉంటున్నాయి. ఈ క్రమంలో `ఘాటి` మూవీ రెండున్నర గంటలకే పరిమితం చేయడం విశేషం. ఇది ఆడియెన్స్ కి కాస్త రిలీఫ్‌నిచ్చే అంశమని చెప్పొచ్చు. షార్ట్ అండ్‌ స్వీట్‌గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

35
లేడీ పుష్పరాజ్‌గా అనుష్క

ఇక సెన్సార్‌ టాక్‌ ప్రకారం సినిమాలో యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు బాగున్నాయని టీమ్ ని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం. అనుష్క చేసిన యాక్షన్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందట. ఫస్ట్ హాఫ్‌ చాలా ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో సాగిందని, రైల్వే స్టేషన్ సీక్వెన్స్, గుహలో జరిగే యాక్షన్ ఫైట్, అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుందట. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, క్లైమాక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందట. ముఖ్యంగా అనుష్క పోషించిన శీలావతి పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉందట. ఆమె నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఆమె పాత్ర ఓ రకంగా లేడీ పుష్పరాజ్‌ని తలపిస్తుందని టీమ్‌ చెబుతోంది.

45
`ఘాటి`లో హైలైట్స్

ఈ మధ్య యాక్షన్ సినిమాలు అంటే ఎక్కువగా CGI, స్టూడియో ట్రిక్స్, బాడీ డబుల్స్ గుర్తొస్తాయి. కానీ ఘాటీలో అనుష్కనే స్వయంగా స్టంట్స్ చేసినట్టుగా సమాచారం. ఆమె చేసిన రా అండ్ రియలిస్టిక్‌ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయట. ఈ సినిమాతో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు తెలుగులో అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనే తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. అనుష్కతో కలిసి ఆయన చేసిన యాక్షన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందట. అలాగే అనుష్క, విక్రమ్ ప్రభు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుగా సమాచారం.

55
`ఘాటి`ని చూసి రాజమౌళి షాక్‌

ఈ సినిమాలో 8 ఫైట్స్ ఉన్నాయని, అవి చూసి సెన్సార్ సభ్యులు సర్ప్రైజ్ అయ్యారట. స్వీటి మాత్రం సినిమాలో నట విశ్వరూపం చూపించినట్టుగా తెలిసింది. ఫైట్ మాస్టర్ రామ్ కృష్ణన్ యాక్షన్ సన్నివేశాలు, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సాయి మాధవ్ బుర్రా, చింతకింది శ్రీనివాసరావు డైలాగ్స్, సాగర్ నాగవెల్లి సంగీతం, ఒడిశాలోని సహజసిద్ద లొకేషన్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయని తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా విజువల్స్ చూసి దర్శకధీరుడు రాజమౌళి ఆశ్చర్యపోయారట. అంతేకాదు.. మహేష్ బాబు సినిమా కోసం ఇదే లొకేషన్స్‌ని పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories