నువ్వు ఎక్కడికి వెళతావు అని ఆటో రాంప్రసాద్ రష్మీని ప్రశ్నించగా ..నాకు తెలుసు అంటూ గెటప్ శ్రీను కల్పించుకుంటాడు. రష్మీ, సుడిగాలి సుధీర్ తొలి కలయిక గురించి శ్రీను పరోక్షంగా కామెంట్స్ చేస్తాడు. 2014 ఫిబ్రవరి 14 న వాలంటైన్స్ డే రోజున అంటూ శ్రీను హార్ట్ సింబల్ చూపిస్తుండగా రష్మీ ఒకవైపు సంతోషం, మరోవైపు సిగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.