ముక్కుపుడక ధరించి హాసిని నవ్వుల జల్లులు.. శారీలో కళ్ళు చెదిరే ఫోజులతో జెనీలియా, పిక్స్ వైరల్

First Published Sep 15, 2022, 12:03 PM IST

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.

గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. 

Genelia D'Souza తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం. 

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జెనీలియా టాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెని అవకాశాలు వరించాయి. 

జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. వివాహం తర్వాత కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె గ్లామర్ ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా జెనీలియా చీరకట్టులో వయ్యారాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేసింది. 

నిండైన చీరలో జెనీలియా సొగసులు చూస్తుంటే క్షణం కూడా చూపు తిప్పుకోవడం కష్టమే. అంతలా జెనీలియా మైండ్ బ్లాక్ చేస్తోంది. క్రీం కలర్ శారీలో ముక్కు పుడక పెట్టుకుని సిగ్గు మెగ్గులేస్తున్నట్లుగా జెనీలియా ఫోజులు ఇచ్చింది. 

జెనీలియాకు టాలీవుడ్ లో హీరో మంచు విష్ణు, రామ్ పోతినేని లతో మంచి సాన్నిహిత్యం ఉంది. వీరితో జెనీలియా ఢీ, రెడీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం జెనీలియా రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. 

click me!