నువ్వు నాలుగు రోజులు వరకు కుదరదు అని చెప్పావట కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎలాగైనా స్వీట్లు కావాలి అని అడుగుతున్నారు వెళ్లి చూడు అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో జెస్సీ,తన గదిలో ఆలోచిస్తూ ఉండగా అఖిల్ ఫోన్ చేస్తాడు. అప్పుడు జెస్సి, ఏమైంది అక్కడికి అఖిల్,అక్క ఇంట్లో వాళ్ళను ఒప్పించిందా? అని అడగగా, నీకు ఏమైనా పిచ్చా నేనేం చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు అబార్షన్ చేసుకోమంటే చేసుకోకుండా మూడో మనిషిని తెచ్చి ఇంట్లో గొడవ పెడుతున్నావు. నీకు నేను కావాలి అంటే ఇప్పుడే ఇవన్నీ మానేసి వెళ్లి అబార్షన్ చేయించుకో లేకపోతే మన పెళ్లి ఇంకెప్పటికీ జరగదు, నేను నీకు ఇంకెప్పటికీ దక్కను జాగ్రత్త అని అంటాడు.