బిగ్ బాస్ ఆడిషన్స్..అమ్మాయిలని మాత్రం హోటల్ కి తీసుకెళతారు, ఫిదా నటి షాకింగ్ కామెంట్స్

Published : Jun 01, 2024, 03:07 PM IST

చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా తరచుగా వార్తల్లో ఉండడం చూస్తున్నాం. గతంలో కూడా ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా మాట్లాడింది.

PREV
16
బిగ్ బాస్ ఆడిషన్స్..అమ్మాయిలని మాత్రం హోటల్ కి తీసుకెళతారు, ఫిదా నటి షాకింగ్ కామెంట్స్

చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా తరచుగా వార్తల్లో ఉండడం చూస్తున్నాం. గతంలో కూడా ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా మాట్లాడింది. తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిదా చిత్రంలో గాయత్రీ గుప్తా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. 

26

బుర్రకథ, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం 2 లాంటి చిత్రాల్లో గాయత్రీ గుప్తా నటించింది. తెలుగు బిగ్ బాస్ లో కూడా గాయత్రికి అవకాశం వచ్చిందట. కానీ విభేదాల కారణంగా ఆ అవకాశం చేజారిందని గాయత్రీ గుప్తా తెలిపింది. బిగ్ బాస్ పై గాయత్రీ గుప్తా చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

36

బిగ్ బాస్ షోకి వెళ్లాలంటే అగ్రిమెంట్ ఓ చాలా కండిషన్స్ ఉంటాయి. వాటన్నింటికి నేను ఒప్పుకున్నాను. బిగ్ బాస్ కి సైన్ చేసిన తర్వాత ఇతర చిత్రాలకు ఒప్పుకోకూడదు. బిగ్ బాస్ కి అంగీకరించిన తర్వాత నేను 15 చిత్రాలు వదులుకున్నాను. కానీ నన్ను సడెన్ గా బిగ్ బాస్ నుంచి తీసేశారు. వాళ్ళు అలా చేయడం వల్ల ఏ ఆర్టిస్ట్ కి అయినా చాలా నష్టం. 

46
Gayathri Gupta

అందుకే నాకు నష్టపరిహారం కావాలని కోర్టుకి వెళ్ళాను. కానీ ఆ కేసుని మరో కోణంలోకి తీసుకెళ్లి నీరుగార్చేశారు. బిగ్ బాస్ ఆడిషన్స్ అని చెప్పి అమ్మాయిలని మాత్రం హోటల్స్ కి తీసుకెళతారు. అందుకే బిగ్ బాస్ ఆడిషన్స్ ఆఫీస్ లోనే నిర్వహించాలని కూడా పోరాటం చేసినట్లు గాయత్రీ గుప్తా తెలిపింది. అమ్మాయిలని బిగ్ బాస్ ఆడిషన్స్ పేరుతో హోటల్ కి తీసుకెళతారనే అంశం మాత్రమే మీడియాలో బాగా హైలైట్ అయింది.. 

56

నాగార్జున గారిపై, బిగ్ బాస్ షోపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను పోరాటం చేసింది బిగ్ బాస్ షో నిర్వాహకులపైనే. నేను కోర్టుకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ రూల్స్ మార్చారు. ఆర్టిస్టులకు ఏదైనా నష్టం వాటిల్లితే నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు. 

66

నేను చేసిన పోరాటం వల్ల నాకు ఎలాంటి లాభం లేదు కానీ చాలా మందికి ఉపయోగపడింది. ఈ విషయాన్ని చాలా మంది బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది తెలిపారని గాయత్రీ గుప్తా పేర్కొంది. 

click me!

Recommended Stories