Guppedantha Manasu: వసు జీవితంలోకి మరో కొత్త వ్యక్తి.. షాక్ లో రిషి.. మరో ఊహించని మలుపు?

Navya G   | Asianet News
Published : Dec 14, 2021, 11:22 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యం లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: వసు జీవితంలోకి మరో కొత్త వ్యక్తి.. షాక్ లో రిషి.. మరో ఊహించని మలుపు?

రెస్టారెంట్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ జగతి (Jagathi) బాధపడుతుంది. చీకటి పడటంతో వసు (Vasu) రాకపోయే సరికి తనకు ఫోన్ చేస్తుంది. వసు బస్సు కోసం ఎదురు చూస్తున్నానని చెబుతుంది. అంతలోనే ఒక వ్యక్తికి ప్రమాదం జరగడంతో అతడి దగ్గరికి వెళుతుంది.
 

28

బాబాయ్ బాబాయ్ అంటూ.. వచ్చేపోయే కార్లను హెల్ప్ కోసం అడుగుతుంది. అప్పుడే ఓ క్యాబ్ లో గౌతమ్ (Gautham) అనే వ్యక్తి అతడిని కాపాడతాడు. అతడిని కారులో తీసుకొని వెళ్తారు. మరోవైపు దేవయానిని (Devayani) చూస్తూ తన పెద్దమ్మకు ఇలా జరిగిందని ఇదంతా వసు వల్ల జరిగిందని మండిపోతాడు.
 

38

ఎలా ఉంది అని ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అంటూ వసు (Vasu)  కోసం ఎదురు చూస్తాడు. ఇక ధరణి (Dharani) తో ఇలా చేసింది ఏంటి అని వసు గురించి మాట్లాడుతాడు. మరోవైపు హాస్పిటల్ లో అతడిని జాయిన్ చేస్తారు. ఇక హాస్పిటల్లో పేషెంట్ తరపున వివరాలు అడుగుతాడు.
 

48

ఇక గౌతమ్ (Gautham) వసు వైపు చూపిస్తూ వాళ్ల బాబాయి అని అంటాడు. వెంటనే వసు (Vasu) మా బాబాయి కాదు అంటూ రోడ్డుపై యాక్సిడెంట్ అవ్వగా మా నాన్న వయసు కంటే చిన్న వాడిలా ఉన్నాడని బాబాయి అన్నాను అంటూ చూస్తూ ఊరుకోలేక హెల్ప్ చేశాను అంటుంది.
 

58

వెంటనే గౌతమ్ వసు (Vasu) మాటలకు ఫిదా అవుతాడు. తనతో కాసేపు మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఇక తను గౌతమ్ (Gautham) అంటూ పరిచయం చేసుకుంటుండగా వసు నమస్కారం పెడుతూ తన సంస్కారం చూపిస్తుంది.
 

68

గౌతమ్ (Gautham) తన పేరు ఏంటో చెప్పొచ్చు కదా అని అనుకుంటాడు. వసు (Vasu) గౌతమ్ ను వెళ్ళమని ఉంటుంది. కానీ అతడు వసుతో మీరు వెళ్ళాక నేను వెళ్తాను అని అంటాడు. అంతలోనే పేషెంట్ కి ఓకే అని డాక్టర్ చెప్పటంతో వసు, గౌతమ్ సంతోష పడతారు.
 

78

ఇక వసు (Vasu) అతనికి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంటికి వెళ్లిన వసు పడుకోకుండా రిషి అన్న మాటలను తల్చుకుంటూ బాధపడుతుంది. ఇదంతా దేవయాని (Devayani) కావాలని చేసిందని అనుకుంటుంది. ఇక రిషి సార్ ఒక మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా అని అనుకుంటుంది.
 

88

అప్పుడే జగతి (Jagathi) రావటంతో ఎలాగైనా తనని వదిలిపెట్టేది లేదు అని అంటుంది. తరువాయి భాగం లో గౌతమ్, రిషి కలుసుకొని ట్విస్ట్ ఇస్తారు. వారిద్దరు ఫ్రెండ్స్ అవ్వటంతో గౌతమ్ వసు గురించి రిషికి చెబుతాడు. దారిలో రిషి (Rishi) కనిపించడంతో గౌతమ్ వసు దగ్గరికి వెళ్లగా రిషి షాక్ అవుతాడు.

click me!

Recommended Stories