యష్మీపై గౌతమ్ ప్రతీకారం.. ఐలవ్ యూ అన్న నోటితోనే అక్కా అంటూ నరకం చూపిస్తున్న డాక్టర్ బాబు

First Published | Oct 29, 2024, 7:28 AM IST

యష్మీపై రివేంజ్ ను గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు గౌతమ్. అందరిని గెలికి మరీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్న యష్మీకి  ఎదరుదెబ్బ గౌతమ్ రూపంలో స్టార్ట్ అయ్యింది. ఇక గౌతమ్ హౌస్ లో ఉన్నన్నాళ్ళు యష్మికి ఇబ్బంది తప్పదనే చెప్పాలి. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో రివేంజ్ రాజకీయాలు బాగా నడుస్తున్నాయి. ఇంట్లో ఉన్నవారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ వస్తోన్న యష్మికి.. గౌతమ్ రూపంలో ఎదరుదెబ్బ తగిలింది. మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకుంటూ.. విష్ణు ప్రియ ప్రేమ మీద దెబ్బకొట్టాలని చూసిన యష్మికి.. ఆమె బండారం అంతా బయటపడటంతో ఏటూ తోచని పరిస్థితి నెలకొంది. 

గౌతమ్ ఫీలింగ్స్ తో ఆడుకోవడం.. అన్ని బకరాను చేసే ప్రయత్నం చేయడంతో యష్మిని గట్టిగా టార్గెట్ చేశాడు గౌతమ్. ఐలవ్ వూ అన్న నోటితోనే అక్కా అంటూ నరకం చూపంచాడు. అంతే కాదు ఈసారి యష్మీ చేసిన తప్పులు ను బయటపెట్టడంలో  నాగార్జున వైపు నుంచి కూడా హెల్ప్ గట్టిగానే జరిగినట్టుంది. ఈ వీకెండ్ రెండు రోజులు యష్మీ -నిఖిల్ బండారం బయట పెట్టే అన్ని క్లిప్పింగ్స్ ను బిగ్ బాస్ ప్లే చేశారు. 


నిజానికి యష్మి హౌస్ లో గేమ్ ఆడటంలో సివంగిలా ఉండేది. కాని ఆమె కన్నింగ్ బుద్దితో  రెండు పెద్ద తప్పులు చేసింది.  అవి ఆమె మెడకు గట్టిగా చూట్టుకున్నాయి. ఒకటి విష్ణు ప్రియ - పృధ్వీని విడదీయటం.. రెండోది గౌతమ్ ను అడ్డు పెట్టుకుని.. అతన్ని ఫూల్ ను చేసి.. నిఖిల్ ప్రేమను పొందాలని చూడటం.. ఇవన్నీ బయట పడటంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యింది. 

ఏం చేయాలో తెలియనిపరిస్థితుల్లో పడిపోయింది. తాజా నామినేషన్స్ లో గౌతమ్ పక్కాగా యష్మిని నామినేట్ చేస్తాడని అందరు ఊహించారు. కాని ఈసారినామినేషన్స్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. దాంతో అతనికి ఆ ఛాన్స్ వస్తుందో రాదో అనుకుంటున్న టైమ్ లో.. యష్మీనే అనవసరంగా గౌతమ్ ను కదిలించింది. దాంతో గౌతమ్ వాదిస్తూ.. అక్కా అక్కా అంటూ.. రష్మీని ఇరిటేట్ చేశాడు. 

దాదాపుగా ఓ 20 టైమ్స్  అక్కా అనివుంటాడు గౌతమ్. దాంతో తనకు ప్రపోజ్ చేసి.. ఐలవ్ వ్యూ చెప్పిన గౌతమ్ అలా అక్కా అనేసరికి తట్టుకోలేకపోయింది యష్మి. నన్ను అలా పిలవద్దు అంటూ గట్టిగా అరిచేసింది. గౌతమ్ మాత్రం నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అక్కా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. గౌతమ్ ఫీలింగ్స్ తో ఆడుకుని.. అతన్ని అడ్డు పెట్టుకుని నిఖిల్ ను ఉడికించాలని చూసింది యష్మి.  

అంతే కాని గౌతమ్ ఎంత సఫర్ అవుతాడు అనేది మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఆడియన్స్ లో యష్మితో పాటు నిఖిల్ గ్రాఫ్ కూడా పడిపోతోంది. అంతే కాదు గౌతమ్ యష్మి మధ్య నిఖిల్ కూడా ఎంటర్ అవ్వబోయాడు. దాంతో గౌతమ్ రెచ్చిపోయి.. నువ్వు లాయర్ వా.. వకాల్తా పుచ్చుకుంటున్నావ్ అనేసరికి.. నిఖిల్ తనమీదకు వస్తుందేమో అని వెనక్కి తగ్గాడు. 

ఇక గౌతమ్ హౌస్ లో ఉన్నన్ని రోజులు యష్మికి నరకం తప్పదనే అనుకోవాలి. వీకెండ్ ఎపిసోడ్స్ లో యష్మి బండారం అంతా బయటపడింది. పృధ్వీ నోటితోనే ఈ విషయాన్ని చెప్పించాడు నాగార్జున. ఏ వచ్చి బీ పై వాలే.. బీ వచ్చి సీపై వాలే.. సీ వచ్చి మళ్ళీ బీ పై వాలిందంటూ.. క్లియర్ కట్ గా జరిగేది అంతా చెప్పేశాడు. 

దాంతో  యష్మీ దొంగ ఏడుపులు స్టార్ట్ చేసింది. గౌతమ్ ను మరోసారి ఫూల్ ను చేయాలి అనుకుంది. అప్పటికి అతను ఆమెను ఒదార్చినా..మనసులో మాత్రం గట్టిగా పెట్టుకున్నాడు. నిఖిల్ గురించి ఇంత బాధపడుతున్నయష్మి.. విష్ణు ప్రియను పృధ్వీని విడదీసినప్పుడు ఈ బుద్ది ఏమైంది. తన ఆలోచన ఏమైంది. అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

Latest Videos

click me!