మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరో. ఆయన్న మించిన మెగాస్టార్ టాలీవుడ్‌లో లేరంటే అతిశయోక్తి లేదు. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అమితాబ్ బచ్చన్ అన్నట్టుగానే కింగ్ ఆఫ్ తెలుగు సినిమా కూడా. సుమారు ఐదు దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఆయన తెలుగు సినిమా దశ దిశ మార్చేశారు. సినిమాలను కమర్షియల్ బాట పట్టించారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ స్కేల్‌ని పెంచారు. సినిమాల్లోకి సునామీలా వచ్చి, ఓ లెజెండ్‌గా ఎదిగారు. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కు అనే స్థాయికి ఎదిగారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలాంటి మెగాస్టార్‌కి అవమానం జరిగిందట. అది సొంత ఇండస్ట్రీలోనే తనకు దారుణమైన అవమానం జరిగిందని తెలిపారు మెగాస్టార్. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యారు. ఇంతకి ఏం జరిగింది? ఇప్పుడెందుకు ఆ విషయం చిరంజీవి తెలిపారనేది చూస్తే, తెలుగు సినిమాకి రెండుకళ్లలో ఏఎన్నార్‌ని మరో కన్నుగా భావిస్తారు.
ఆయన పేరిట జాతీయ అవార్డుని స్థాపించారు అక్కినేని నాగార్జున. తాజాగా ఏఎన్నార్ జాతీయ పురస్కారం ఈ ఏడాదికి గానూ మెగాస్టార్ చిరంజీవికి అందిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ ఏఎన్నార్ జాతీయ పురస్కారం అందించారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తనకు `లెజెండరీ పురస్కార ప్రదానం చేశారట. అందుకు తాను చాలా సంతోషించినట్టు తెలిపారు. తన జీవితం ధన్యమైందనుకున్నారట. కానీ అది ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకించారు, అభ్యంతరం తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం కాదని భావించి, దాన్ని ఓ క్యాప్సుల్ బాక్స్ లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందోఅప్పుడే తీసుకుంటానని చెప్పారట. ఆ రోజు రచ్చ గెలిచాను, కానీ ఇంటగెలవలేదన్నారు చిరు. ఇప్పుడు ఏఎన్నార్ పురస్కారం అందుకుంటుంటే ఎస్ ఇప్పుడు ఇంట గెలిచాను, రచ్చ గెలిచాననే ఫీలింగ్ కలుగుతుందన్నారు.
చిరంజీవి ఇంకా మాట్లాడుతూ, `తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని.
ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అని అనుకున్నా. కానీ ఆయన అలా అనలేదు. అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను.
దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది.
సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు.
అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను.
నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పా. ఇదే మాట ఇప్పుడు స్టేజీ మీద చెబుతున్నా` అని అన్నారు చిరంజీవి.
read more: రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? పేరెంట్స్ పెద్ద షాక్
also read: కథ నచ్చలేదన్న డైరెక్టర్-ప్రొడ్యూసర్, ఓకే చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏమిటో తెలుసా?