Garividi Lakshmi 2 Days Collections: రెండో రోజు పుంజుకున్న గరివిడి లక్ష్మి.. అయినా దారుణం

Published : Oct 19, 2026, 06:56 AM IST

ఆనంది ప్రధాన పాత్రలో నటించిన `గరివిడి లక్ష్మి` మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం సత్తా చాటలేకపోతుంది. రెండు రోజుల్లో ఈ మూవీకి వచ్చిన కలెక్షన్లు షాకిస్తున్నాయి.

PREV
14
ఆకట్టుకుంటోన్న గరివిడి లక్ష్మి

ఆనంది, రాగ్‌ మయూర్‌ జంటగా, వీకే నరేష్‌, రాశి, శరణ్య, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `గరివిడి లక్ష్మి`. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి, గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. దీనికి చరణ్ అర్జున్‌ సంగీతం అందించడం విశేషం. బయోపిక్‌ తరహాలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా శనివారం (అక్టోబర్‌ 17)న విడుదలైంది. మూవీకి ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వచ్చింది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

24
రెండో రోజు పుంజుకున్న గరివిడి లక్ష్మి మూవీ

`గరివిడి లక్ష్మి` ఒక బయోపిక్‌ మూవీ. `మహానటి` తరహాలోనే తెరకెక్కింది. సినిమా కూడా అలానే ఉంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం సత్తా చాటలేకపోయింది. క్రిటిక్స్ నుంచి మంచి స్పందన, మంచి రివ్యూలు వచ్చాయి. కానీ అది కలెక్షన్ల రూపంలో టర్న్ కావడం లేదు. అయితే రోజు రోజుకి పుంజుకోవడం విశేషం. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఈ చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

34
గరివిడి లక్ష్మి మూవీ రెండు రోజుల కలెక్షన్లు

మొదటి రోజు గరివిడి లక్ష్మి రూ.70లక్షలు వసూలు చేస్తే, రెండో రోజు రూ.89లక్షలు రాబట్టింది. ఆదివారం కలెక్షన్లు పెరగడం విశేషం. సోమవారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా వీకెండ్‌ తర్వాత తగ్గుతాయి. కానీ సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మూవీకి పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఓవరాల్‌గా చూస్తే ఈ మూవీకి దారుణమైన కలెక్షన్లు అనే చెప్పాలి. సినిమా టాక్‌కి వచ్చిన కలెక్షన్లకి సంబంధం లేదు. మరి దారుణంగా ఉన్నాయి. సినిమా భారీగా పుంజుకుంటే గట్టేక్కే ఛాన్స్ ఉంది, లేదంటే డిజాస్టర్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈమూవీకి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రెండు కోట్ల వరకే ఉందని సమాచారం. అంటే నాలుగైదు కోట్ల కలెక్షన్లు వస్తే సినిమా సేఫ్‌ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడున్న టాక్‌, వరుస సెలవుల నేపథ్యంలో సినిమా గట్టెక్కుతుందని చెప్పొచ్చు.

44
గరివిడి లక్ష్మి మూవీ కథ

ఉత్తరాంధ్ర విజయనగరం ప్రాంతంలో గరివిడి లక్ష్మి చాలా ఫేమస్‌. ఆమె బుర్రకథల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. జానపద పాటలతో అలరించింది. మరీ బుర్రకథనే కాకుండా, దానికి కొంత మోడ్రన్‌ టచ్‌ యాడ్‌ చేస్తూ, యూత్‌ని ఆకట్టుకునేలా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ అలరించింది. చాలా పాపులర్‌ అయ్యింది. అయితే ఆమె అడుగడుగునా మోసానికి గురయ్యింది. చిన్నప్పట్నుంచి ఒంటరైపోయింది. ఆమె బుర్రకథ కళాకారిణిగా పాపులారిటీ, ఆటుపోట్లు, అవమానాలు, మోసాలు వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని బయోగ్రాఫికల్‌ మ్యూజికల్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు గౌరీ నాయుడు. సినిమా అదిరిపోయింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories