బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఈ ఆదివారం 42వ రోజు ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. కానీ షాలినిని ఎలిమినేట్ చేసినట్లే చేసి నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆమెని సీక్రెట్ రూమ్ కి పంపారు.
బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం రోజు ఎవరూ ఎలిమినేట్ కాలేదు. కానీ షాలిని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున అందరినీ నమ్మించారు. షాలినిని ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్ కి పంపారు. దీనితో ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. హౌస్ లో ఉన్న సభ్యులంతా షాలిని నిజంగానే ఎలిమినేట్ అయింది అనే భ్రమలో ఉన్నారు.
25
నామినేషన్స్ లో ఆ ముగ్గురు
నామినేషన్స్ లో చివరికి వరకు రోహిత్, షాలిని, వర్షిణి ఉన్నారు. వీరి ముగ్గురిలో రోహిత్ సేవ్ అయ్యాడు. ఇక మిగిలింది వర్షిణి, షాలిని. తాను ఎలిమినేట్ అవుతానని షాలిని ముందే గ్రహించి రోహిత్ ని కౌగిలించుకుని మాట్లాడడం మొదలు పెట్టింది. నాగార్జున వర్షిణి, షాలిని లని గార్డెన్ ఏరియాకి పిలిచారు. అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్ లలో వాళ్లిద్దరూ నిలబడాలి. నాగార్జున పిలిచిన పేర్ల ప్రకారం వాళ్లిద్దరూ ముందుకు కదలాలి.
35
నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు
ఎవరైతే ముందుగా ఎండ్ బాక్స్ కి చేరుకోవాల్సి వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు. షాలిని ఎండ్ బాక్స్ కి చేరుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. షాలినిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. రోహిత్ ని ఓదారుస్తూ షాలిని కూడా ఏడ్చేసింది. ఎవరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. ఈ అమ్మాయి చాలా బ్యాడ్ అని తిట్టినా పర్వాలేదు.. కానీ నువ్వొక్కడివి నన్ను అర్థం చేసుకుంటే చాలు అంటూ షాలిని రోహిత్ తో ఎమోషనల్ గా మాట్లాడింది.
ఆ తర్వాత హౌస్ మేట్స్ కి గుడ్ బై చెప్పి స్టేజీ పైకి వెళ్ళింది. హౌస్ లో ఉన్న వారిలో నీ స్థానంలో ఎలిమినేట్ కావలసిన వాళ్ళు ఎవరు ? ఎవరికి హౌస్ లో ఉండే అర్హత లేదు ? అని నాగార్జున అడిగారు. ముందుగా షాలిని వంశీ పేరు చెప్పింది. ఆయన త్రిగుణ్ కి పప్పెట్. ఎలాగోలా సర్వైవ్ అవుతున్నాడు. నా ప్లేస్ లో ఆయన ఎలిమినేట్ కావలసింది అని పేర్కొంది. షాలిని చెప్పిన రెండవ పేరు సుధీర్. సుధీర్ సొంత గేమ్ ఆడకుండా ముకేశ్, వర్షిణి కంట్రోల్ లో ఉన్నాడు అంటూ షాలిని పేర్కొంది. షాలిని చెప్పిన మూడో పేరు వర్షిణి. వర్షిణి కన్నా గేమ్స్ లో నేను స్ట్రాంగ్. కాబట్టి ఆమె ఎలిమినేట్ కావాల్సింది అని షాలిని పేర్కొంది.
55
షాలిని ఎలిమినేట్ కాలేదు, బిగ్ ట్విస్ట్
దీనితో నాగార్జున హౌస్ మేట్స్ కి గుడ్ నైట్ చెప్పి ముగించారు. షాలిని కూడా నాగార్జున వద్ద ఆశీర్వాదం తీసుకుని ఇంటికి బయలుదేరింది. కానీ అప్పుడు నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వెళ్లిపోతున్న షాలినిని వెనక్కి పిలిచారు. నువ్వు ఎలిమినేట్ కాలేదు అని చెప్పారు. దీనితో షాలిని సంతోషంతో ఎగిరి గంతేసింది. ప్రస్తుతానికి నిన్ను సీక్రెట్ రూమ్ కి పంపుతాం. నువ్వు హౌస్ లోకి ఎప్పుడు వెళ్ళాలి అనేది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు అని నాగార్జున తెలిపారు.