గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ: సినిమా ఫలితం తేల్చేసిన ప్రముఖుడు, హిట్టా ఫట్టా?

First Published | Nov 22, 2024, 11:46 AM IST

గేమ్ ఛేంజర్ మూవీ విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ రివ్యూ చదివాక ఫుల్ కిక్ ఫీల్ అవుతారు. ఇంతకీ మూవీ ఎలా ఉండనుంది అంటే?
 

Game Changer

భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇండియన్ సినిమాకు భారీతనాన్ని నేర్పిన దర్శకుడు ఆయన. ఏళ్ల క్రితమే వందల కోట్ల బడ్జెట్ మూవీస్ తెరకెక్కించారు. సోషల్ సబ్జెక్ట్స్ కి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడంలో దిట్ట. ఇక శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. ఆ మూవీలోని ఒక్క రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. 

ఆ మూవీ విడుదలై రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లకు మరలా శంకర్ గేమ్ ఛేంజర్ టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. గతంలో శంకర్ ఇతర పరిశ్రమల హీరోలతో పని చేసింది లేదు. ఆయన కోలీవుడ్ హీరోలకు మాత్రమే అవకాశం ఇచ్చేవాడు. ఫస్ట్ టైం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. 
 


గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పాత్రలో ఆయన రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. మొదటిసారి రామ్ చరణ్ పంచె కట్టులో ఒక పాత్ర చేస్తున్నారు. ఆయన పీరియాడిక్ లుక్ ఆసక్తిరేపుతోంది. కియారా అద్వానీ హీరోయిన్. సునీల్, శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 

చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సంక్రాంతి రేసు నుండి తప్పుకోగా గేమ్ ఛేంజర్ ఆ తేదీకి వస్తుంది. జనవరి 10న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. ఎస్ జే సూర్య గేమ్ ఛేంజర్ మూవీలో ప్రధాన విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశాడు. పనిలో పనిగా సినిమా పై షార్ట్ రివ్యూ కూడా ఇచ్చాడు. 

''హాయ్ ఫ్రెండ్స్, గేమ్ ఛేంజర్ మూవీలోని రెండు కీలక సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశాను. ఒక సన్నివేశం రామ్ చరణ్ తో మరొక సన్నివేశం శ్రీకాంత్ తో. దీనికి మూడు రోజుల సమయం పట్టింది. అవుట్ ఫుట్ మాత్రం .. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది, అన్న రేంజ్ లో ఉంది. థియేటర్స్ లో మామూలు రెస్పాన్స్ ఉండదు. నాకు అది ముందే కనిపిస్తుంది. పోతారు..మొత్తం పోతారు,

థ్యాంక్యూ శంకర్, దిల్ రాజు... ఈ అవకాశం ఇచ్చినందుకు. సంక్రాంతికి రామ్ చరణ్ దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం, మళ్ళీ కలుద్దాం...'' అని ఎస్ జే సూర్య ట్వీట్ చేశాడు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎస్ జే సూర్య షార్ట్ రివ్యూ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. మూవీ చాలా బాగా వచ్చిందనే నమ్మకం ఏర్పరిచింది. గేమ్ ఛేంజర్ తోరామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు. 

Latest Videos

click me!