విష్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’ఎంతకు అమ్మారు, బ్రేక్ ఈవెన్ ఎంత ?

First Published | Nov 22, 2024, 11:08 AM IST

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'మెకానిక్ రాకీ' ఈ వారం విడుదలైంది. 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. సెకండాఫ్ బాగుందని, కానీ ఫస్టాఫ్ లో కథ నెమ్మదిగా సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ ఏడాదిలో విష్వక్‌సేన్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో చిత్రం... ‘మెకానిక్ రాకీ’. ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ తర్వాత ప్రేక్షకుల తీర్పుని కోరుతున్న చిత్రమిది. ఈ వారం విడుదలైన సినిమాల్లో స్ట్రాంగ్ పబ్లిసిటీతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తదితర తారలూ ఈ సినిమాకి  స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ రోజు రిలీజైన ఈ చిత్రం ఎంత బిజినెస్ చేసింది. ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిందో చూద్దాం. 


ఈ మెకానిక్ రాకీ చిత్రం ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ సినిమా మీద మంచి అంచనాలు అయితే పెంచింది అని చెప్పాలి. దానికి తోడూ విశ్వక్ సేన్ కూడా మంచి ఫామ్ లోనే ఉండటంతో ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చిందనే  చెప్పాలి.

ఇక సినిమా నవంబర్ లాంటి అన్ సీజన్ లో..రిలీజ్ కి వచ్చినా  బజ్  బాగుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 7.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.


అలాగే మరోవైపు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ మార్కెట్ అంతా కలిపితే.. రూ. 1.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 10 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం  ఉంది.

ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. ఈ వారం విడుదలైన చిత్రాల్లో  చెప్పుకోదగ్గ  చిత్రం ఇదే . వాణిజ్య హంగుల మోతాదు కారణంగా ఇది కమర్షియల్ సినిమా అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ తో  కూడిన కథ. 


ఫక్తు థ్రిల్లర్ సినిమాకి అవసరమైన సరకున్న కథ మెకానిక్ రాకీ. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉందని ఇప్పటిదాకా వచ్చిన టాక్.  చాలావరకు సీరియస్ అంశాలున్న ఈ సినిమాకి వాణిజ్య హంగులు జోడించటం కాస్త మైనస్ గా మారిందంటున్నారు.

వాటి కారణంగా కథలో డెప్త్ కొరవడింది. కామెడీ సన్నివేశాలు, పాటల మధ్య ఫస్టాఫ్ లో కథే ముందుకు కదలదు. పాత్రలు నడుచుకునే విధానం మొదలుకుని కథలో చోటు చేసుకునే పరిణామాల వరకూ ఏవీ సహజంగా అనిపించవు. దాంతో ప్రేక్షకుడు కథలో లీనం కాలేకపోయారు అని చెప్తున్నారు. కామెడీ కూడా పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు.  సెకండాఫ్  ఈ సినిమాకి ప్రధానబలం.  


ఏదైమైనా విశ్వక్ సేన్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా వర్కవుట్ అయితే తిరుగు ఉండదు.

 ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. పూర్తి మాస్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలే ఉన్నాయి. తాజాగా ప్రీమియర్స్ షోతో ఈ సినిమాతో రెగ్యులర్ మాస్ మసాలా మూవీ అని చెబుతున్నారు. అయితే  ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెబుతున్నారు. 
 

విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన యాటిట్యూడ్ తో కెరీర్ బిగినింగ్ నుంచి ఆకర్షిస్తున్నాడు. అంతే విశ్వక్ సేన్ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలా మంచి హిట్ అందుకోలేకున్నాడు. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం విశ్వక్ స్టైల్ వేరు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ.  రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రజిని తాళ్లూరి నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.  

Latest Videos

click me!