Gaalodu Movie Review: గాలోడు మూవీ ట్విట్టర్ టాక్.. ఆ కోణంలో సుడిగాలి సుధీర్ దుమ్మురేపాడట!

Published : Nov 18, 2022, 10:19 AM IST

బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా ఎదగాలని గట్టి ప్రయత్నాలు చేశారు. గతంలో ఆయన హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాలు తెరకెక్కాయి. మూడో ప్రయత్నంగా గాలోడు చిత్రంలో నటించారు. నవంబర్ 18న విడుదలైన గాలోడు ట్విట్టర్ టాక్ ఏమిటో చూద్దాం...   

PREV
16
Gaalodu Movie Review: గాలోడు మూవీ ట్విట్టర్ టాక్.. ఆ కోణంలో సుడిగాలి సుధీర్ దుమ్మురేపాడట!
Gaalodu Review

జబర్దస్త్ కమెడియన్ గా ప్రస్థానం మొదలుపెట్టిన సుధీర్ బుల్లితెర స్టార్ గా ఎదిగారు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ఆయన ఇమేజ్ పెంచాయి. సుధీర్ మల్టీ టాలెంట్స్ గుర్తింపు తెచ్చిపెట్టాయి. సుధీర్ ప్రొఫెషనల్ మ్యుజీషియన్. ఇక డాన్స్, సింగింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది.

26
Gaalodu Review

సుధీర్ ని పాప్యులర్ చేసిన అంశాల్లో రష్మీ గౌతమ్ తో లవ్ ఎఫైర్ కూడా ఒకటి. జబర్దస్త్, ఢీ షో లో వీరి రొమాన్స్, కెమిస్ట్రీ అద్భుతాలు చేసింది. లవ్ బర్డ్స్ అన్న ఇమేజ్ స్టార్డం తెచ్చిపెట్టింది. రియాలిటీలో మాత్రం మేము స్నేహితులమే అని చెప్పుకునే ఈ జంట ప్రేక్షకుల మదిలో ప్రేమికులు. 
 

36
Gaalodu Review

ఇక సుధీర్ లేటెస్ట్ మూవీ గాలోడు మూవీ థియేటర్స్ లో దిగింది. గాలోడు ట్రైలర్, ప్రోమోలు ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా సుధీర్ మాస్ మేనరిజమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో గాలోడు మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

46
Gaalodu Review

ఇప్పటికే గాలోడు మూవీ షోస్ పడ్డాయి. ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. గాలోడు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నట్లుతెలుస్తుంది. కొందరు ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్ గా మరికొందరు రొటీన్ స్టోరీ అంటున్నారు. సుధీర్ కామెడీ, మాస్ మేనరిజమ్, డాన్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ గ్లామర్ పాజిటివ్ అంశాలుగా చెబుతున్నారు.

56
Gaalodu Review


అయితే రొటీన్ స్టోరీ కావడంతో పాటు కథనం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదంటున్నారు. సుధీర్ అభిమానులను మాత్రం గాలోడు ఎంటర్టైన్ చేస్తుంది అంటున్నారు. వారు ఎంజాయ్ చేసే అంశాలు గాలోడు మూవీలో చాలా ఉన్నాయి, అంటున్నారు. ఇక పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా భవితవ్యం తెలియదు. 
 

66

చిత్రంలో సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటించగా.. స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీగా సి రాంప్ర‌సాద్‌, సంగీతం: భీమ్స్ సిసిరోలియో ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌గా బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌ వ్యవహరించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మించారు. ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలను రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌ చూసుకున్నారు. 

click me!

Recommended Stories